
మార్చి ఆరంభంలోనే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. రోజురోజుకీ మండుతున్న ఎండల(to the sun)కు ప్రజలు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. మార్చి మొదటి వారంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు(Record high temperatures) నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే చాలు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అయితే మండే వేసవి(Summer)లో తగిన జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బ వంటి ఆరోగ్య సమస్యల(Health problems) బారిన పడే అవకాశం ఉంటుందని వైద్యులు(Doctors) హెచ్చరిస్తున్నారు. సమ్మర్‌లో హెల్త్ టిప్స్(Health Tips) పాటించకపోతే సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని అంటున్నారు. అందుకే సురక్షిత ఆరోగ్యం కోసం పలు జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నారు.
బయటికి వెళ్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి
ప్రజలు వేసవిలో ముఖ్యంగా వడదెబ్బ(Sunburn) బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వేసవిలో వైద్య పరంగా, ఎండకు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు పాటించాలి. కాటన్ దుస్తులను ధరించాలి. నలుపు రంగు దుస్తుల ఎట్టిపరిస్థితుల్లోనూ ధరించవద్దు. ఎండలో బయటికి వెళ్లవద్దు. ఏదైనా పనులు ఉంటే ఉదయం, సాయంత్రం వేళలో చూసుకోవాలి. మధ్యాహ్నం వేళలో బయటికి వెళ్లవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లవలసి వస్తే గొడుగు, సన్ గ్లాసెస్, బైక్ పై వెళ్లేవారు క్యాప్స్, హెల్మెట్(Helmets) ధరించాలి.
వదబెద్బ లక్షణాలు ఇవే
తలనొప్పి(Headache), శరీరం నీరసంగా అనిపించడం, వాంతులు, చెమట పట్టకపోవడం, కళ్లు తిరగడం, కాళ్లలో తిమ్మిర్లు రావడం, పని ఏకాగ్రత తగ్గి గందరగోళం పడడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బకు గురైనట్లు గుర్తించాలి. వేసవిలో సాధ్యమైనంత వరకు చల్లటి ప్రదేశాలలో ఉండాలి. ఒకవేళ ఎండలో వెళ్లి వడదెబ్బకు గురైతే వెంటనే చల్లటి క్లాత్‌తో చర్మాన్ని తుడవాలి. నీరు తాగించాలి. ORS, మజ్జిగ ఇలాంటివి తాగించాలి. తడి క్లాత్‌తో తుడిచినా శరీరంలో ఉష్ణోగ్రత తగ్గక పోతే సమీపంలోని వైద్యుడి(Doctor)ని సంప్రదించి తగిన చికిత్స పొందాలని చెబుతున్నారు.