RGVకి ప్రపోజ్ చేసిన పాపులర్ సింగర్.. వర్మ రియాక్షన్ ఏంటంటే?

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి తెలియనివారుండరు. ఆయన రూటే సపరేటు. బంధాలు బంధుత్వాలకు ఆయన చాలా దూరంగా ఉంటారు. అలాగని ఏదో సన్యాసి జీవితం గడపరూ. లైఫ్ ను ఎంత ఎంజాయ్ చేయాలో అంతకుమించి ఎంజాయ్ చేస్తారు. కానీ తనను కట్టడి చేసే బంధాలకు మాత్రం దూరంగా ఉంటారు. అందుకే ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఆర్జీవీ చాలా తక్కువగా మాట్లాడుతుంటారు.

వర్మకు సింగర్ ప్రపోజ్

ఇక ఆర్జీవీ (RGV) లైఫ్ స్టైల్ ను, ఆయన సిద్ధాంతాలను చాలా మంది అభిమానిస్తుంటారు. రామూయిజాన్ని చాలా మంది ఫాలో అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. అందుకే ఆర్జీవీకి శిష్యులు ఎక్కువ. అయితే వర్మ తనకు విడాకులైన తర్వాత ప్రేమ, పెళ్లి వంటి వాటి జోలికి వెళ్లలేదు. వాటికి ఆయన వ్యతిరేకం అని కూడా చాలాసార్లు చెప్పుకొచ్చారు. అయితే విడాకుల తర్వాత వర్మకు ఓ పాపులర్ సింగర్  లవ్ ప్రపోజ్ చేసిందన్న విషయం చాలా మందికి తెలియదు. ఇంతకీ ఆమె ఎవరంటే..?

ఆర్జీవీకి పెళ్లి ప్రపోజల్

పాపులర్ సింగర్, యాక్టర్ సుచిత్ర కృష్ణమూర్తి (Suchitra Krishnamoorthi) తన పుస్తకం ‘డ్రామా క్వీన్’ (Drama Queen) లో ఆర్జీవీతో పెళ్లి ప్రపోజల్ గురించి రాశారు. రామ్ గోపాల్ వర్మ ఆఫీసుకు వెళ్లిన తాను.. ఓసారి సరదాగా ఆయనకు లవ్ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకోమని అడిగానని ఆ బుక్ లో పేర్కొన్నారు. అయితే తన ప్రపోజల్ తో వర్మ ఒక్కసారిగా షాకయ్యారని చెప్పారు. దెబ్బకు కంగారు పడ్డారని తెలిపారు.

నేను అలాంటి వ్యక్తిని కాను

‘సుచిత్రా..నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావనుకుంటున్నాను. నేను అస్సలు ఎప్పుడూ ఒకేలా ఉండను. నాకు వివాహ వ్యవస్థపై, ప్రేమపై నమ్మకం లేదు. నేను పెళ్లి చేసుకునే టైపు కాదు. ఈ ఆలోచన వదిలేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి’. అంటూ ఆర్జీవీ తనకు చెప్పారని సుచిత్ర డ్రామా క్వీన్ పుస్తకంలో రాసుకొచ్చారు. ఆ పుస్తకంలో రాసింది నిజమేనని తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమె ధ్రువీకరించారు.

ఆ చొరవతోనే ప్రపోజ్ చేశా

మై వైఫ్స్ మర్డర్ (My Wife’s Murder), ర‌న్ (Run) అనే రెండు సినిమాల కోసం ఆర్జీవీ, సుచిత్ర కలిసి పని చేశారు. ఈ సమయంలోనే వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వర్మతో జోవియల్ గా ఉండేంత చనువు సుచిత్రకు ఉంది. అందుకే సరదాగా వర్మను ఆట పట్టించేందుకు పెళ్లి ప్రపోజల్ తన ముందుకు తీసుకెళ్లానని సుచిత్ర చెప్పుకొచ్చారు. అయినా వర్మ తిరస్కరించారని తెలిపారు. అతడి అనుమతి తీసుకున్న తర్వాతే ఆ పుస్తకంలో ఈ విషయాన్ని రాశానని వెల్లడించారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *