ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అదరగొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్(RR)తో జరిగిన మ్యాచులో 44 పరుగుల తేడాతో గ్రాండ్ విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో ఇరు జట్ల బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి ఆడారు. తొలుత SRH 20 ఓవర్లలో 286/6 స్కోరు చేసింది. ఈ జట్టులో ఇషాన్ కిషన్ సెంచరీతో చెలరేగగా.. హెడ్ 67, నితీశ్ 30, అభిషేక్ 24, క్లాసెన్ 34 రన్స్‌తో చెలరేగారు. అటు ఛేదనలో రాజస్థాన్ సైతం ఏమాత్రం తగ్గలేదు.
528 runs scored in 240 balls… incredible hitting #IPL2025 #SRHvsRR https://t.co/E4xxgEEt6B
— A:gyaani 🇮🇳 (@sukalyanfouzdar) March 23, 2025
ఇంపాక్ట్ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ 66, ద్రువ్ జురెల్ 70, హెట్‌మయర్ 42, శుభమ్ దూబే 34 రన్స్ చేసినా లక్ష్యానికి 44 పరుగుల దూరంలో నిలిచింది. రైజర్స్ బౌలర్లలో సిమర్ జిత్ సింగ్ 2, హర్షల్ పటేల్ 2,జంపా, షమీ ఒక్కో వికెట్ తీయగా.. రాజస్థాన్ బౌలర్లలో దేశ్ పాండే 3,తీక్షణ 2, సందీప్ 1 వికెట్ తీశాడు.
Dhruv Jurel 70 (35) made sure that RR will get closer to the mighty score of SRH. With a great display of big hits, he proved RR had made the right decision to retain him.#IPL2025 #TATAIPL2025 #DhruvJurel #RRvSRH #SRHvsRR #RajasthanRoyals pic.twitter.com/PsbQKMEgC2
— बातम्या खेळांच्या (@Surendra21286) March 23, 2025
బౌండరీల సునామీ
కాగా ఈ మ్యాచులో రెండు జట్లు భారీ స్కోరు సాధించాయి. తొలుత సన్ రైజర్స్ 286 రన్స్ చేయగా.. ఛేదనలో రాజస్థాన్ జట్టు 242 రన్స్ చేసింది. రెండు జట్లు 528 పరుగులు చేసి రికార్డు సృష్టించాయి. ఇక ఇందులో SRH 12 సిక్సర్లు బాదగా.. RR 18 సిక్సర్లు నమోదు చేసింది. ఇక SRH 34 ఫోర్లు కొట్టుగా.. RR బ్యాటర్లు 17 ఫోర్లు బాదారు. సెంచరీతో చెలరేగిన ఇషన్ కిషన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ లభించింది. కాగా ఈ విజయంతో ఈ సీజన్‌ను రైజర్స్ తన జర్నీని ఘనంగా ప్రారంభించింది.






