ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) సిద్ధమైంది. అహ్మదాబాద్(Ahmedabad) వేదికగా జరుగుతున్న 51వ మ్యాచులో టాస్ నెగ్గిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి చేరాలంటే SRH మిగతావి అన్నీ చావో రేవో మ్యాచ్‌లే. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఇవాళ GTతో కాకుండా మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. అన్నింటిలో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌కు అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉన్న గుజరాత్ ఇవాళ గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను పటిష్ఠం చేసుకోవాలని చూస్తోంది.
హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇలా..
ఇక ఐపీఎల్‌లో హెడ్ టు హెడ్ రికార్డ్స్‌లలో గుజరాత్ టైటాన్సే(GT) పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఐపీఎల్‌లో ఐదు మ్యాచ్‌లలో తలపడితే గుజరాత్ నాలుగు గెలవగా, సన్‌రైజర్స్ ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఆడిన మ్యాచ్‌లో కూడా గుజరాత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక అహ్మదాబాద్‌లో ఆడిన 2 మ్యాచ్‌లలోనూ గుజరాతే గెలవడం విశేషం.
తుది జట్లు ఇవే..
Gujarat Titans: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(C), జోస్ బట్లర్(Wk), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
Sunrisers Hyderabad: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ (Wk), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (C), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ
Toss Update: 🧡 SRH won the toss & opted to bowl first! 🔥
Playing XI:
GT: Gerald Coetzee in for Karim Janat
SRH: Unchanged XI#SRHvGT #SRHvsGT #GTvsSRH #IPL2025 pic.twitter.com/8IFeM9igPM— IPL Mantra (@IPL_Mantra) May 2, 2025






