Retro Collections: సూర్య ‘రెట్రో’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

తమిళ స్టార్ హీరో సూర్య(Suriya), డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ (Director Karthik Subbaraj) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘రెట్రో(Retro)’. సమ్మర్ స్పెషల్‌గా గురువారం (మే 1) వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వచ్చేసింది. సూర్య కాస్త గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ మూవీపై ఫస్ట్ నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ మూవీ కలెక్షన్లను మేకర్స్ ప్రకటించారు. తమిళనాడు(Tamilnadu)లో సూర్య(Suriya) కెరీర్‌లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను మొదటి రోజు సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా హిట్-3 మూవీ కూడా నిన్ననే రిలీజ్ కావడంవల్ల అనుకున్న రేంజ్‌లో రెట్రో ఇంపాక్ట్ చూపించలేదు.

Retro box office collection day 1: Suriya starrer action-drama starts  strong, collects 19.25 Crore

కానీ ఓవరాల్‌గా పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్‌ను మొదటి రోజున సొంతం చేసుకుంది. రూ.2.5 కోట్ల రేంజ్‌లో గ్రా‌స్ మార్క్‌ని అందుకుంటుంది అనుకున్నా కూడా సినిమా ఆ మార్క్‌ని కూడా మించిపోయింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు వసూలైన గ్రాస్ కలెక్షన్లను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు రూ.46కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ఓ పోస్టర్ రివీల్ చేశారు. వీకెండ్, సమ్మర్ హాలిడేస్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

సూర్య నటన సినిమాకే హైలైట్‌

సంతోష్ నారాయణన్(Santosh Narayanan) మ్యూజిక్ అందించిన ఈ మూవీని 2D ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై జ్యోతిక (Jyothika), సూర్య ప్రొడ్యూస్ చేశారు. అయితే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో సూర్య నటన సినిమాకు హైలైట్‌గా నిలిచినా.. రోటీన్ స్టోరీ, స్క్రీన్‌ ప్లేలో కొత్తదనం లేకపోవడంతో మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ఈ మూవీ వసూళ్లలో మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *