Mana Enadu: ప్రస్తుతం సినీ పరిశ్రమలో రీరిలీజ్‌ల(Re-Release) ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇటీవల అతడు, ఒక్కడు, వెంకీ, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇంద్ర, జయం వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రీరిలీజ్ అయి కలెక్షన్ల సునామీ సృష్టించాయి. తాజాగా ఆ జాబితాలోకి మరో బ్లాక్‌బస్టర్(Blockbuster) మూవీ ‘ఖడ్గం(Khadgam)’ చేరింది. ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకమైన అభిమానులు(Fanbase) ఉన్నారు. ఇది ఇప్పటికీ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సందర్భంగా TVల్లో ప్రసారం చేస్తుంటారు. అలాగే ఈమూవీలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్(Super Hit) అయ్యింది. ఈ మూవీ రేపు (అక్టోబర్ 18న) రీరిలీజ్ కానుంది.
ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం
తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమా ఖడ్గం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ(Director Krishnavanshi) దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీకాంత్(Srikanth), రవితేజ(Ravi Teja), ప్రకాష్ రాజ్(Prakash Raj) ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో సంగీత, సోనాలి బింద్రే, కిమ్ శర్మ, బ్రహ్మజీ, పూజా భారతి కీ రోల్ పోషించారు. 2002లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. లవ్, కామెడీ, దేశం ఎమోషన్, మూవీ ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్(Emotions) కలిపి మల్టీ జానర్లో ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారు.
KHADGAM……. powerful n meaningful Dialogies by my dear friend n multi talented UTTEJ ♥️♥️♥️ pic.twitter.com/OwPdM6L1O4
— Krishna Vamsi (@director_kv) October 16, 2024
నా లైఫ్ లో ఈ సినిమాను మర్చిపోలేను: శ్రీకాంత్
దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేస్తున్నారు. దీంతో ఈ మూవీ ప్రమోషన్ల(Movie promotions)లో పెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కృష్ణవంశీ, శ్రీకాంత్, శివాజీ రాజా, షపీ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ.. “భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశంతో ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టాను” అని అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “జనరేషన్స్ మారినా పెట్రియేటిక్ సినిమా(patriotic movies)ల్లో అన్నిటిలో ఖడ్గం గొప్ప సినిమా. నా లైఫ్ లో ఈ సినిమాను మర్చిపోలేను. ఈ మూవీ మళ్లీ విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ” అన్నారు.






