Mana Enadu: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు( Supreme Court of India) తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా(New CJI Justice Sanjiv Khanna) నియమితులయ్యారు. ప్రస్తుత CJI డీవై చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10న ముగియనుంది. దీంతో జస్టిస్ ఖన్నా పేరును చంద్రచూడ్ సిఫార్సు చేయగా… రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Droupadi Murmu) ఆమోదం తెలిపారు. దీంతో వచ్చే నెల 11వ తేదీన సుప్రీంకోర్టు 51వ సీజేఐగా జస్టిస్ ఖన్నా బాధ్యతలు స్వీకరించనున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ (Union Law& Justice Minister Arjun Ram Meghwal) వెల్లడించారు. కాగా వచ్చే ఏడాది మే 13 వరకు ఖన్నా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా కొనసాగుతారు.
1983లో డీజీసీలో న్యాయవాదిగా చేరిన ఖన్నా
డీవై చంద్రచూడ్(CJI DY Chandrachud) నవంబర్ 10న పదవీ విరమణ చేయనుండగా.. సంప్రదాయం ప్రకారం పదవిలో తన వారసుడి పేరును కోరుతూ ఇటీవల ప్రభుత్వం ఆయనకు లేఖ రాసింది. కాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేస్తారు. అతను (Delhi Bar Council)లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.
న్యాయసేవలో అపార అనుభవం
అంతకుముందు ఆయన తీస్ హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా కోర్టు, తర్వాత ఢిల్లీ హైకోర్టు, ట్రిబ్యునళ్ల(Delhi High Court and Tribunals)లో ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ ఖన్నా ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department)కు సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా పనిచేశారు. 2004లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి స్టాండింగ్ కౌన్సెల్ (CIVIL) అయ్యారు. జనవరి 18, 2019న ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకముందే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్(Executive Chairman, National Legal Services Authority), నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ(National Judicial Academy), భోపాల్ గవర్నింగ్ కౌన్సెల్ సభ్యుడిగా ఉన్నారు.