YCP Big Expose: వైసీపీ ట్రూత్ బాంబ్.. డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?

Mana Enadu: ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. నిత్యం ఏదో ఒక సమస్యతో రాజకీయ మంటలు(Political war) మండుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా(Social Media)లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు తార స్థాయికి వెళ్తున్నాయి. ఒకరిపై ఒకరు పెట్టుకునే పోస్టులకు హద్దులు కూడా ఉండవు. ఇప్పుడు మరోసారి రెండు పార్టీల మధ్య పోస్టర్ల యుద్ధం జరుగుతోంది. TDP, వైసీపీ పెట్టిన పోస్టర్స్(Posters) చర్చనీయాంశంగా మారాయి.

సరిగ్గా 12గంటలకు ట్వీట్

ఇటీవల YCP, TDP మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. నిన్న ఆస్తులపై జగన్‌కు షర్మిల రాసిన లేఖను టీడీపీ బయటపెట్టగ.. తాజాగా టీడీపీపై వైసీపీ మరో సంచలన ట్వీట్ చేసింది. వైసీపీ చెప్పినట్లుగానే సరిగ్గా 12గంటలకు ట్వీట్ చేసింది. ‘మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్‌ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్‌ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!’ అంటూ కొన్ని పత్రాలను జత చేసింది.

ఇదిలా ఉండగా రేపు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ఎక్స్ ప్లోజ్.. చూస్తూనే ఉండాలంటూ బుధవారం టీడీపీ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌కు కౌంటర్ గా వైసీపీ కూడా బిగ్ రివీల్.. ట్రూత్ బాంబ్ డ్రాపింగ్ అని పోస్టర్ విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు టీడీపీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో టీడీపీ ఏం చెప్పబోతోంది? అని ప్రజల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది.

 

Share post:

లేటెస్ట్