హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ఇవాళ వాటర్ కట్

Mana Enadu : హైదరాబాద్​ వాసులకు అలర్ట్​. నీటి సరఫరాపై జలమండలి(Jala Mandali) తాజాగా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపింది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-3లో లీకేజీ కారణంగా గురువారం రోజున నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని ప్రకటించింది. 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్​ మెయిన్​కు లీకేజీ ఏర్పడడంతో మరమ్మతు పనులు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

రేపు ఉదయం 6 గంటల వరకు

ఈ నేపథ్యంలో అందువల్ల గురువారం (అక్టోబర్ 24వ తేదీ) ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా(Water Supply)కు ఆటంకం కలుగుతుందని జలమండలి ఎంజీ అశోక్‌ రెడ్డి తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తిరిగి శుక్రవారం ఉదయం 6 గంటల తర్వాత మళ్లీ యథావిథిగా నీటి సరఫరా ప్రారంభం అవుతుందని వెల్లడించారు. మరి నగరంలోని ఏయే ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందంటే?

ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

ఫిల్మ్ నగర్, ప్రశాసన్ నగర్, తట్టిఖానా, లాలాపేట్, సాహెబ్ నగర్, శాస్త్రిపురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్ పేట్, ఆళ్లబండ, జూబ్లీ హిల్స్(Jubilee Hills), ఆటోనగర్, సరూర్‌నగర్, వాసవి రిజర్వాయర్లు,స్నేహపురి, కైలాసగిరి, దేవేంద్ర నగర్, మధుబన్, దుర్గానగర్, బుద్వేల్, సులేమాన్‌నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్, కిస్మత్ పూర్, గంధంగూడ, సైనిక్ పురి, మౌలాలి, గచ్చిబౌలి, మాదాపూర్(Madhapur), అయ్యప్ప సొసైటీ, కావురి హిల్స్, బోడుప్పల్, మల్లిఖార్జున నగర్, ఫిర్జాదిగూడ, పెద్ద అంబర్‌పేట్, శంషాబాద్ ధర్మసాయి, మాణిక్‌చంద్, చెంగిచెర్ల, భరత్‌నగర్ ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు నీటి సరఫరా ఉండదు.

Share post:

లేటెస్ట్