3రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్ల నరికివేత.. TG సర్కార్‌పై ‘సుప్రీం’ సీరియస్

తెలంగాణలో కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli Land)లో 400 ఎకరాల స్థలంలో చెట్ల నరికివేత(Tree Felling) విషయంలో సుప్రీం కోర్టు(Supreme Court) తీవ్రంగా స్పందించింది. బుధవారం సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వాని(Telangana Govt)కి చుక్కెదురైంది. 3 రోజుల్లోనే 100 ఎకరాల చెట్లు నరికివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. అది కూడా సెలవు రోజులు చూసుకుని ఆ పని చేయడం వెనుక ప్రభుత్వ ఆంతర్యం ఏంటని కోర్టు నిలదీసింది. అటవీ ప్రాంతం(Forest Area)లో అభివృద్ధి పేరుతో చెట్లు కొట్టేసే ముందు సంబంధిత అధికార యంత్రాంగం వద్ద అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది.

Kancha Gachibowli

వారంతా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి..

ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు చెట్లు నరికిన 100 ఎకరాల్లో పూర్వస్థితిని ఎలా తీసుకొస్తారో చెప్పాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. లేదంటే తాత్కాలికంగా జైలు(Jail)కు వెళ్లేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండండాలని హెచ్చరించింది. మీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary to the State Govt) జైలుకు వెళ్లకుండా కాపాడుకోవాలనుకుంటే 100 ఎకరాల్లో పూర్వ స్థితిని తీసుకొచ్చే ప్రణాళికతో రావాలని సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ ఏ.జి. మసిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా సుప్రీం తీర్పు కాంగ్రెస్ సర్కార్‌కి చెంపపెట్టు లాంటిదని విపక్షాలు అంటున్నాయి.

Telangana moves HC over AI images of tree felling | Latest News India -  Hindustan Times

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *