Mana Enadu: ప్రస్తుత రోజుల్లో చాలా మంది పొద్దంతా బిజీబిబీగా గడిపి, మానసికంగా, శారీరంగానూ చాలా ఒత్తిడికి గురవుతుంటారు. అలసటతో ఇంటికి వచ్చీరాగానే నేరుగా బాత్రూం(Bathroom)లోకి వెళ్తుంటారు. స్నానం(Bath) చేసి రిలాక్స్ అవుతుంటారు. కానీ స్నానం చేశాక చాలా మంది ఓ తప్పు చేస్తుంటారు. అది ఎంతో ప్రమాదకరమని వైద్య నిపుణులు అంటున్నారు. నిద్రకు ఉపక్రమించే ముందు స్నానం చేస్తే మెదడు(Brain)పై దుష్ప్రభావం పడుతుందని, డిప్రెషన్‌కు కూడా కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలా చేయడం ఏమాత్రం మంచిది కాదు
చాలా మంది స్నానం చేసిన వెంటనే గబగబా కొంత తినేసి బెడ్‌పై వాలిపోతుంటారు. ఇలా చేయడం ఆరోగ్యాని(Health)కి ఏ మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు(Health Experts) హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ఎందుకంటే రాత్రి వేళ్లలో మన శరీర ఉష్ణోగ్రత(Body Temperatures) తక్కువగా ఉంటుంది. దీన్ని మెదడు గ్రహించి బాడీకి రెస్ట్ కావాలనే సిగ్నల్స్ ఇస్తుంది. నిద్ర పోవాలనే సూచన చేస్తుంది. ఇలా నిద్రపోవాలని మెదడు సిగ్నల్ ఇస్తున్న టైంలో మీరు స్నానం చేస్తే మాత్రం బాడీలోని టెంపరేచర్ ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో మెదడు కన్ఫ్యూజ్ అవుతుందట.
ఈ సమస్యలు తలెత్తే ప్రమాదం
☛ చాలా మంది రాత్రి వేళ భోజనం చేశాక స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల బరుగు పెరుగుతారట. శరీర సామర్థ్యాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న ఊబకాయంతో మధుమేహం(Diabetes) వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
☛ స్నానం చేసిన తర్వాత తడి వెంట్రుకలతో నిద్రించడం వల్ల దిండు లేదా మంచం మీద బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని వల్ల స్కాల్ప్(Scalp) దెబ్బతింటుంది. జుట్టు చిట్లడం సమస్య పెరుగుతుంది. జుట్టులో చుండ్రు వస్తుంది.
☛ వేడి నీళ్లతో నిరంతరం స్నానం చేయడం వల్ల కళ్లలో తేమ తగ్గుతుంది. దీని వల్ల కళ్లు ఎర్రగా మారుతాయి. దురద సమస్య మొదలవుతుంది. దీని కారణంగా అనేక ఇతర కంటి సంబంధిత సమస్యలు కూడా రావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.