కొత్త సినిమా ప్రకటించిన ధ్రువ్.. యంగ్ హీరో పేరులో చిన్న ఛేంజ్

కోలీవుడ్ హీరోల సినిమాలు చాలా వరకు తెలుగులోనూ డబ్ అయి రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అలా తెలుగులోనూ సూపర్ క్రేజ్ దక్కించుకున్న తమిళ హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు విక్రమ్ (Vikram). పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడంలో విక్రమ్ ను మించిన వారు ఇండియన్ సినిమాలోనే లేరు. పాత్ర కోసం బరువు పెరగాలన్నా.. తగ్గాలన్నా.. ఎలాంటి ప్రయోగం చేయాలన్న విక్రమ్ ముందుంటాడు. అందుకే ఆయనకు కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోనూ క్రేజ్ ఎక్కువే.

ధ్రువ్ సింగింగ్ అదుర్స్

ఇక ఆయన వారసత్వం పుణికిపుచ్చుకుని సినిమాల్లోకి వచ్చాడు విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram). అర్జున్ రెడ్డి సినిమాను  రీమేక్ ‘ఆదిత్య వర్మ (Adithya Varma)’ అనే చిత్రంతో అరంగేట్రం చేశాడు. ఆ సినిమాను తమిళ ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి మహాన్ (Mahaan) అనే మూవీ చేశాడు. అది ఓకే అనిపించినా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఆ తర్వాత నుంచి ధ్రువ్ నుంచి సినిమా రాలేదు. కానీ సింగింగ్ లో తన ప్రావీణ్యం చూపించాడు.

బైసన్ గా ధ్రువ్

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హాయ్ నాన్న (Hi Nanna) సినిమాలో ధ్రువ్ ఓ పాట పాడాడు. గోవా బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఓడియమ్మ అనే పాటను పాడి అలరించాడు. తమిళంలోనే కాదు తెలుగులోనూ ఈ సాంగ్ ను ధ్రువ్ పాడాడు. ఇక ఈ పాట ఎంతటి క్రేజ్ దక్కించుకుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇక తాజాగా ధ్రువ్ చాలా రోజుల తర్వాత కొత్త సినిమా ప్రకటించాడు. బైసన్ (Bison) అనే మూవీతో వస్తున్నట్లు అనౌన్స్ చేశాడు.

తండ్రి పేరు తొలగించిన ధ్రువ్

మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పోస్టర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే నెపో కిడ్ గా తనపై ముద్ర పడకూడదనే ఉద్దేశంతో ధ్రువ్ ఈ సినిమా టైటిల్స్ లో తన పేరు తర్వాత తన తండ్రి పేరు విక్రమ్ ను తొలగించాడు. మొన్నటిదాక ‘ధ్రువ్ విక్రమ్’ అని టైటిల్ కార్డులో వేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు సోలోగా ‘ధ్రువ్ (DHRUV)’గానే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వర్ (Anupama Parameswaran) హీరోయిన్ గా నటిస్తోంది.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *