Tata Curvv ICE: తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే కారు.. టాటా కర్వ్ వచ్చేసింది!

ManaEnadu: కారు లవర్స్‌(Car lovers)కు గుడ్‌న్యూస్. ప్రజెంట్ ఫ్యామిలీతో కలిసి టూర్ల(Tours)కి వెళ్లాలన్నా.. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలన్నా కచ్చితంగా కారు ఉండాల్సిందే. అందుకే చాలా మంది తక్కువ బడ్జెట్లో (Low Budget) మంచి మైలేజ్(Mileage) ఇచ్చే కార్లను కొనాలనుకుంటారు. మరి మీరూ అదే ప్రయత్నంలో ఉన్నారా? అయితే మీకే ఈ శుభవార్త. మంచి సీటింగ్​తో, ఫీచర్స్​ & స్పెక్స్(Features & Specs)​ ఉన్న కారును ప్రముఖ టాటా కంపెనీ తీసుకొచ్చింది. దాని ఫీచర్స్, మైలేజ్, ధర తదితర వివరాలేంటో ఓ లుక్ వేద్దాం పదండి..

 అక్టోబర్ 31 వరకూ బుకింగ్‌కు ఛాన్స్

ఇండియాలోనే మోస్ట్ ఐకానిక్ వెహికల్ కంపెనీ టాటా మోటార్స్(Tata Motors). మార్కెట్లోకి ఎన్ని కొత్త బ్రాండ్ కార్లు వస్తున్నా టాటా బ్రాండ్ మాత్రం నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అన్న విధంగానే ఉంటుంది. తాజాగా టాటా నుంచి సరికొత్త మోడల్ Tata Curve ICE మార్కెట్లోకి వచ్చాయి. గతంలోనే ఈ కార్ల బుకింగ్స్ ఓపెన్(Bookings open) అయినా.. డెలివరీలు మాత్రం తాజాగా ప్రారంభమయ్యాయి. దీనికి ప్రారంభ ధర రూ. 9.99 లక్షల (Ex-showroom)గా ఫిక్స్ చేసి రిలీజ్ చేసింది. 2024 అక్టోబర్ 31 వరకూ బుకింగ్ చేసుకునే కస్టమర్‌లకు ఇది ప్రారంభ ధర. ఆ తర్వాత కంపెనీ ధరను కూడా పెంచే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబరు 2న ప్రారంభించబడిన టాటా Curvv మాస్ మార్కెట్లో కూపే-SUV సెగ్మెంట్‌లో పరిచయం చేస్తోంది.

డజన్ల కొద్ది ఫీచర్స్..

దాని ఎలక్ట్రిక్ వేరియంట్(Electric variant) ICE-పవర్‌తో పనిచేసే Curvv ATLAS ఆర్కిటెక్చర్‌పై మ్యాన్యుఫ్యాక్చర్ అయింది. కూపే-SUV స్టైలింగ్ టాటా కొత్త ‘డిజిటల్’ డిజైన్ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంటుంది. Tata Curvv స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అచీవ్డ్ అనే నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. వాటి మధ్య మొత్తం ఎనిమిది వేరియంట్లలో ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి. టాటా మోటార్స్ కర్వ్ SUV రెండు పెట్రోల్ ఇంజిన్, ఒక డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లతో వస్తుంది. ఈ కారులో నెక్సాన్ నుండి 1.2-లీటర్ టర్బోచార్జ్డ్(Turbocharged) పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. ఇది 119bhp పవర్, 170Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. డీజిల్ ఆప్షన్ కొత్త 1.5-లీటర్ కైరోటెక్ ఇంజిన్‌(Kyrotech Engine)ను కలిగి ఉంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCA ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అంతేకాదండోయ్ క్యాబిన్ 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్‌(Sound system) కూడా అమర్చారు. Tata Curvv 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌ కూడా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం పదండి టాటా షోరూమ్‌కి టాటా కర్వ్ ఐసీఈ కార్లను రైడ్ చేసేద్దాం..

Related Posts

Stocks: ఎంపిక చేసుకున్న షేర్లలోనే ట్రేడింగ్ కీలకం!

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ వారం మిశ్రమంగా చలించొచ్చు. సెప్టెంబర్లో యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉండటం, కంపెనీల ఫలితాలు, GST సంస్కరణలు సూచీలకు ఊతమిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్స్(Trump Tarrifs), రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వివరణపై స్పష్టత లేకపోవడం, మారుతున్న…

హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు అదుర్స్! ధర ఎంతంటే..?

హీరో ఎలక్ట్రిక్ సబ్సిడరీ(Hero Electric Sabsidari) అయిన విడా(Vida VX2) సంస్థ తాజాగా తన కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ VX2(Famely Electric Schooter)ను మార్కెట్‌లోకి విడుదల(Lanched) చేసింది. ఈ స్కూటర్‌ను రెండు వేరియంట్లలో అందిస్తున్నారు – Go మరియు Plus.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *