ఐపీఎల్(IPL)లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) కెప్టెన్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు తమ జట్టు స్కిపర్ పేరును ఢిల్లీ ఫ్రాంచైజీ ఇవాళ (మార్చి 14) అఫిషియల్‌గా ప్రకటించింది. టీమ్ఇండియా(Team India) యంగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్(Axer Patel)ను DC కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో అక్షర్ పటేల్ ఢిల్లీని నడిపించనున్నట్లు పేర్కొంది. DC తాజా ప్రకటనతో అన్ని జట్ల కెప్టెన్లు ఎవరనేది తేలిపోయింది.
అందుకే రాహుల్ తప్పుకున్నాడు..!
కాగా తొలుత KL రాహుల్, అక్షర్ పటేల్ మధ్య పోటీ ఉండగా.. KL తాను ఆటపై దృష్టి సారించాలని, తనను కెప్టెన్‌గా ఎంపిక చేయొద్దంటూ మేనేజ్మెంటుకు తెలిపాడు. దీంతో రాహుల్ నిర్ణయాన్ని గౌరవించిన ఢిల్లీ అక్షర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. 2019 నుంచి ఢిల్లీ జట్టులో అక్షర్ పటేల్ కొనసాగుతున్నాడు. మెగావేలాని(Mega Auction)కి ముందు అతడిని ఢిల్లీ రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది. కాగా.. అతడికి కెప్టెన్సీ అనుభవం పెద్దగా లేనప్పటికి ఢిల్లీ అతడిపై నమ్మకం ఉంచింది.

అక్షర్ ఢిల్లీ తరుపున ఆరు సీజన్లలో 82 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఓవరాల్‌గా 150 IPL మ్యాచ్‌లు ఆడాడు. 21.5 సగటు, 130.9 స్ట్రైక్‌రేటుతో 1,653 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 7.27 ఎకానమీతో 123 వికెట్లు తీశాడు.
ఐపీఎల్‌లో అన్ని జట్ల కెప్టెన్లు వీరే..
☛ CSK- రుతురాజ్ గైక్వాడ్
☛ DC- అక్షర్ పటేల్
☛ GT- శుభ్‌మన్ గిల్
☛ KKR- అజింక్య రహానే
☛ LSG- రిషభ్ పంత్
☛ MI- హార్దిక్ పాండ్య
☛ PK- శ్రేయస్ అయ్యర్
☛ RCB- రజత్ పాటీదార్
☛ RR- సంజూ శాంసన్
☛ SRH- పాట్ కమిన్స్







