భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) జులై 2025కి సంబంధించి ‘ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్(ICC Player of the Month)’ అవార్డును గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్(England)తో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)లో అతని అద్భుత ప్రదర్శన ఈ గౌరవాన్ని సాధించిపెట్టింది. ఈ అవార్డును గెలవడం గిల్‌కు ఇది నాల్గవసారి, దీంతో మెన్స్ విభాగంలో అతను ఈ అవార్డును నాలుగు సార్లు గెలిచిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో గిల్ జనవరి 2023, సెప్టెంబర్ 2023, ఫిబ్రవరి 2025లో ఈ అవార్డును అందుకున్నాడు. గిల్ జులైలో మూడు టెస్టుల్లో 567 పరుగులు సాధించాడు, సగటు 94.50. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ టెస్టు(Edgbaston Test)లో 269, 161 పరుగులతో 430 పరుగులు కొట్టి, టెస్ట్ చరిత్రలో రెండో అత్యధిక పరుగుల సాధనగా రికార్డు సృష్టించాడు.
ఐదు టెస్టుల్లో మొత్తం 754 పరుగులు
ఓవరాల్‌గా ఇంగ్లాండ్ సిరీస్(England Series)లో మొత్తం 754 పరుగులతో అతను సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు, సగటు 75.40. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes), దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ మల్డర్(Wiaan Mulder)లను వెనక్కి నెట్టి ఈ అవార్డును గిల్ సొంతం చేసుకున్నాడు.”మొదటి టెస్ట్ సిరీస్ కెప్టెన్‌గా ఈ అవార్డు గెలవడం చాలా ప్రత్యేకం. బర్మింగ్‌హామ్‌లో డబుల్ సెంచరీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని గిల్ అన్నాడు. అతని నాయకత్వంలో భారత్ సిరీస్‌ను 2-2తో డ్రా చేసింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో 103 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి, డ్రా సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో గిల్ భారత టెస్ట్ జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచాడు.
Shubman Gill wins ICC Player of the Month! 🌟 Another proud moment for India’s rising superstar. 🇮🇳🏏
.
.
.#ShubmanGill #ICCAwards #PlayerOfTheMonth #IndianCricket #CricketNews #CricketRecords #CricketUpdates #TestCricket #ODICricket #T20Cricket #CricketLove #CricketFans pic.twitter.com/DUaBGONj0k— Cric Files (@TheCricfiles) August 12, 2025






