BRS:మల్కాజిగిరి పార్లమెంట్​ బరిలో సింగిరెడ్డి..

మన ఈనాడు: రాబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో ఉప్పల్​ కాంగ్రెస్​ టిక్కెట్​ ఆశించిన భంగపడిన సింగిరెడ్డి సోమశేఖర్​రెడ్డి బీఆర్​ఎస్​ గూటికి చేరారు. ఆయన్ను మల్కాజిగిరి పార్లమెంట్​ బరిలో నిలిపేందుకు కారు నేతలు సిద్దం అయ్యారని సమాచారం.

సీఎం రేవంత్​రెడ్డిపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో పదునైన విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. గతంలో ఇక్కడ బీఆర్​ఎస్​ పార్లమెంట్​ ఇంఛార్జీగా వ్యవహరించిన మర్రి రాజశేఖర్​రెడ్డి మల్కాజిగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో మల్కాజిగిరి పార్లమెంట్​ నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని బీఆర్​ఎస్​ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

ఉప్పల్​ నియోజకవర్గానికి చెందిన సింగిరెడ్డి సోమశేఖర్​రెడ్డి ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేతగా ఉండటంతో మల్కాజిగిరి పార్లమెంట్​ నుంచి పోటీ చేయించేందుకు ఇప్పటికే గులాబీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రెండు, మూడు రోజుల్లో పార్టమెంట్​ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను పార్టీ ప్రకటించబోతున్నట్లు సమాచారం

Related Posts

Vijayasai Reddy : ‘లిక్కర్ స్కామ్ కేసులో వాళ్ల భరతం పట్టండి.. నేను సహకరిస్తా’

ఆంధ్రప్రదేశ్‌లో లిక్క్‌ స్కామ్‌ కేసు (AP Liquor Scam Case)లో రోజుకో కీలక మలుపు చోటుచేసుకుంటుంది. సంచలనం రేపిన ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సిట్ విచారణ (SIT Inquiry) ఎదుర్కొని కీలక సమాచారాన్ని అధికారులు అందించారు.…

HCU వివాదం.. మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న అంశం HCU భూముల వివాదం. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలి 400 ఎకరాల (Kancha Gachibowli Land Issue) విషయం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *