Traffic challan: వాహనదారులకు శుభవార్త… చలాన్లపై మరోసారి రాయితీ!

మన ఈనాడు:తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలానాలు కట్టలేని వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. 2022 లో మాదిరిగానే ఈసారి కూడా ట్రాఫిక్ చలానాలపై రాయితీ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని సమాచారం

Traffic Challans Discount: రాష్ట్రంలోని వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నారట. గత ప్రభుత్వం పెండింగ్ లో ట్రాఫిక్ చలాన్లకు వాసులు చేసేందుకు చెప్పటిన రాయితీ విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరోసారి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది అధికారిక వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దీనిపై ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని.. త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక జీవో జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

2022లో గత ప్రభుత్వం చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు కొత్త విధానాన్ని అమలు చేసింది. అదేంటంటే ట్రాఫిక్ చలానాలపై రాయితీ ప్రకటించడం. 2022లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ఖజానాలోకి భారీ డబ్బు సమకూరింది. ట్రాఫిక్ చలానాలు ప్రజలు కట్టరనుకున్న పోలీసుల ఆలోచలనకు వాహనదారులు ఊహించని షాక్ ఇచ్చారు. రాయితీ ఉండడంతో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న చలానాలు కూడా కట్టేశారు జనాలు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెండింగ్ చలానాలు కట్టడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.300 కోట్లు జమ అయ్యాయి. అయితే ఇదే మాదిరిగా వాహనదారులకు ఈ పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలానాల నుంచి రిలీఫ్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారట. మరోసారి చలానాలపై రాయితీ ఇవ్వనున్నారట.

Share post:

లేటెస్ట్