Telangana: పౌరహక్కుల నేతల ఇళ్లలో NIA సోదాలు

హైదరాబాద్​: ఏపీ, తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు.. పౌరహక్కుల నాయకుల ఇళ్లలో ఏకకాలంలో ఎన్‌ఐఏ (NIA) సోదాలు చేస్తుంది. హైదరాబాద్‌తోపాటు ఏపీలోని 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎన్‌ఐఏ (NIA) దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌తోపాటు ఏపీలో 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని ఉస్మాన్‌ సాహెబ్‌ పేటలో ఉన్న జిల్లా పౌరహక్కుల సంఘం నేత ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఆయన పౌరహక్కుల సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఇక పౌరహక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న అన్నపూర్ణ, అనూశ నివాసాల్లోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. తిరుపతిలో ఉంటున్న న్యాయవాది క్రాంతి చైతన్య, నెల్లూరులో అరుణ, గుంటూరులో డాక్టర్‌ రాజారావుతోపాటు ప్రకాశం జిల్లాలోని చీమకుర్తికి చెందిన కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకట్రావు, సంతమాగూలూరులో ఓరు శ్రీనివాస రావు, రాజమంత్రిలోని బొమ్మెరలో పౌర హక్కుల నేత నాజర్‌, హార్లిక్స్‌ ఉద్యోగి కోనాల లాజర్‌, శ్రీకాకుళం జిల్లాలో కేఎన్పీఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిస్కా కృష్ణయ్య ఇండ్లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఇక హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందని ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల సంఘం నేత సురేశ్‌ ఇంటిపై ఎన్‌ఐఏ దాడి చేసింది. సురేశ్‌తోపాటు ఆయన బంధుమిత్రుల ఇండ్లలోనే సోదాలు నిర్వహిస్తున్నారు. వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, రిక్రూట్‌మెంట్‌కు సహాయసహకారాలు అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Share post:

లేటెస్ట్