
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Session) కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రిగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(FM Minister, Deputy CM Bhatti Vikramarka) మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సంక్షేమం, అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వాని(TG Govt)కి జోడు గుర్రాలను అన్నారు. అంబేడ్కర్ సూచించిన నైతిక విలువలను పాటిస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 2025-26కి గాను తెలంగాణ రాష్ట్ర మొత్తం రూ. 3.04 లక్షల కోట్లుతో బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. మొత్తం 72 పేజీలతో భట్టి తన ప్రసంగాన్ని కొనసాగించారు. బడ్జెట్‌లోని కీలక అంశాలు ఇలా..
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కి రూ. 11,600 కోట్లు
రాష్ట్ర ప్రగతి కోసం తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతోపాటు హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. అలాగే ఆరోగ్య శ్రీ(Aarogyasri) పరిధి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నాట్లు చెప్పారు. కొత్తగా 1,835 వైద్య చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నామని, దీంతో 90 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే వైద్య కళాశాలలకు భారీగా నిధులు కేటాయింపుతోపాటు 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కి రూ. 11,600 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
రైతులకు రూ. 20, 616 కోట్ల రుణమాఫీ
రైతులకు రూ. 20, 616 కోట్లు రుణ మాఫీ(Runamafi) చేశామని, రైతు భరోసా కింద ఎకరాకు రూ. 12 వేలు, రైతు భరోసా(Rythu Bharosa)కు రూ. 18000 కోట్ల బడ్జెట్.. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ అందించామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంచామన్నారు. పశు సంవర్ధక శాఖకు రూ. 1,647 కోట్లు, వ్యవసాయ మార్కెట్లకు రూ.181 కోట్లతో ఆధునిక సదుపాయలు అందిస్తామని చెప్పారు.
రాజీవ్ యువ వికాస పథకానికి రూ. 6000 కోట్లు
ఏఐ సిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్ హబ్.. ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింపునకు కృషి చేస్తున్నామని, ఇప్పటి వరకు 57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. రాజీవ్ యువ వికాస పథకానికి రూ. 6000 కోట్లు కేటాయించినట్లు భట్టి తెలిపారు.