తెలంగాణ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇవే

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌(Telangana Budget)ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) శాసనసభలో ఇవాళ ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను సభకు సమర్పిస్తున్నట్లు తెలిపారు. తమను నమ్మి అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామని వివరించారు.

శాఖల వారీగా కేటాయింపులివే

  1. 2025-26 రాష్ట్ర బ‌డ్జెట్ రూ.3,04,965 కోట్లు
  2. రెవెన్యూ వ్యయం – రూ.2,26,982 కోట్లు
  3. మూలధన వ్యయం – రూ.36,504 కోట్లు
  4. వ్యవసాయశాఖ – రూ.24,439 కోట్లు
  5. పశుసంవర్ధకం – రూ.1,674 కోట్లు
  6. పౌరసరఫరాలశాఖ – రూ.5,734 కోట్లు
  7. విద్యా రంగం – రూ.23,108 కోట్లు
  8. కార్మికశాఖ – రూ.900 కోట్లు
  9. పంచాయతీరాజ్‌ శాఖ – రూ.31,605 కోట్లు
  10. మహిళా శిశుసంక్షేమశాఖ – రూ.2,862 కోట్లు
  11. ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు
  12. ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు
  13. బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు
  14. చేనేత రంగం – రూ.371 కోట్లు
  15. మైనార్టీ సంక్షేమం – రూ.3,591 కోట్లు
  16. పరిశ్రమలు – రూ.3,527 కోట్లు
  17. ఐటీ రంగం – రూ.774 కోట్లు
  18. విద్యుత్‌ రంగం – రూ.21,221 కోట్లు
  19. వైద్య రంగం – రూ.12,393 కోట్లు
  20. పురపాలక రంగం – రూ.17,677 కోట్లు
  21. నీటిపారుదల శాఖ – రూ.23,373 కోట్లు
  22. రహదారులు, భవనాలశాఖ – రూ.5,907 కోట్లు
  23. పర్యాటక రంగం – రూ.775 కోట్లు
  24. క్రీడలు – రూ.465 కోట్లు
  25. అటవీ, పర్యావరణం – రూ.1,023 కోట్లు
  26. దేవాదాయశాఖ – రూ.190 కోట్లు
  27. హోంశాఖ – రూ.10,188 కోట్లు
  28. ఆరు గ్యారంటీలు – రూ.56,084 కోట్లు
  29. రైతు భరోసా – రూ.18 వేల కోట్లు
  30. చేయూత పింఛన్లు – రూ.14,861 కోట్లు
  31. ఇందిరమ్మ ఇళ్లు – రూ.12,571 కోట్లు
  32. మహాలక్ష్మి (ఆర్టీసీ బస్సు) రూ.4,305 కోట్లు
  33. గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) రూ.2,080 కోట్లు
  34. సన్నాలకు బోనస్ – రూ.1,800 కోట్లు
  35. రాజీవ్ ఆరోగ్యశ్రీ – రూ.1,143 కోట్లు
  36. గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ – రూ.723 కోట్లు
  37. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా – రూ.600 కోట్లు
  38. విద్యుత్ రాయితీ – రూ.11,500 కోట్లు
  39. రాజీవ్ యువ వికాసం రూ.6 వేల కోట్లు
  40. ఎస్డీఎఫ్ , సీడీపీ నిధులు రూ.3,300 కోట్లు
  41. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రూ.2,900 కోట్లు
  42. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల మెరుగుదల – రూ.500 కోట్లు
  43. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి – రూ.100 కోట్లు
  44. ఇందిరా గిరి జల వికాసం – రూ.600 కోట్లు
  45. నగరాభివృద్ధి – రూ.వెయ్యి కోట్లు
  46. పర్యాటక ప్రాజెక్టులు – రూ.721 కోట్లు
  47. గ్రామాల్లో వంద శాతం సౌర విద్యుత్ – రూ.1,500 కోట్లు
  48. గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం – రూ.వెయ్యి కోట్లు
  49. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు – రూ.1,511 కోట్లు
  50. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ – రూ.3,683 కోట్లు
  51. ఉపకారవేతనాలు – రూ.4,452 కోట్లు
  52. బియ్యం రాయితీ – రూ.3 వేల కోట్లు
  53. రైతు బీమా – రూ.1,589 కోట్లు

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *