TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ‘భట్టి’ పద్దుపై భారీ అంచనాలు

వచ్చే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్‌(Telangana Budget 2025-26)ను కాంగ్రెస్ సర్కార్(Congress Govt) ఇవాళ అసెంబ్లీ(Assembly)లో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ మొత్తం రూ.3.15 లక్షల కోట్లతో బడ్జెట్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది బడ్జెట్‌ రూ.2.90 లక్షల కోట్లు కాగా ఆదాయం అంచనాల కన్నా రూ.50 వేల కోట్ల వరకూ తగ్గుదల నమోదయ్యే సూచనలున్నాయి. ఇవాళ (మార్చి 19) ఉదయం 11 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు(Sridhar Babu) 2025-26 ఆర్థిక సంవత్సరానికి పద్దును ప్రవేశపెట్టనున్నారు.

సీఎం అధ్యక్షతన క్యాబినెట్ భేటీ

ఇదిలా ఉండగా బడ్జెట్‌కి ముందు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం(Cabinet meeting) జరుగుతుంది. ఉదయం 9.30కి అసెంబ్లీ కమిటీ హాల్‌(Assembly Committee Hall)లో జరగనున్న ఈ భేటీలో బడ్జెట్‌ని ఆమోదిస్తారు. ఆ తర్వాత ఉదయం 11.15కి డిప్యూటీ సీఎం, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. ఈ బడ్జెట్‌ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అలాగే.. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో బడ్జెట్‌ని ప్రవేశపెడతారు.

Telangana Cabinet Meeting: HYDRA granted expanded powers - RTV English

ఈ రంగాలకే అధిక కేటాయింపులు

కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీ హామీలకు అధికంగా నిధులు కేటాయిస్తారని సమాచారం. కొత్తగా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్(Musi Riverfront), ఫ్యూచర్‌ సిటీ, మెట్రో రైలు విస్తరణ(Expansion of Metro Rail), ప్రాంతీయ వలయ రహదారి, దీనికి అనుసంధానంగా రేడియల్‌ రోడ్ల నిర్మాణం వంటివాటికి కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *