–నరేష్ చిట్టూరి
మన ఈనాడు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలపై ఇప్పటివరకు ప్రచారం మాత్రమే జరిగింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మరో అడుగు ముందుకేసి ఆంజనేయస్వామి సాక్షిగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రమాణం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం చోప్పకట్లపాలెం గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు చేశారు. అనంతరం రూ.100ల బాండ్ పేపర్ ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని రాసి స్వయంగా సంతకం చేసి దేవాలయంలో అందజేశారు.
మధిర ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రగతి కోసం పనిచేస్తానని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అవినీతికి తావులేకుండా పారదర్శకమైన పాలన రాష్ట్ర ప్రజలకు అందించేందుకు నిజాయితీగా పనిచేస్తానని తెలిపారు.
రెండురోజుల క్రితం ప్రియాంక్‌గాంధీ సభలో మధిర గేట్‌ను వందమంది కేసీఆర్‌లు వచ్చినా తాకలేరని బీఆర్ఎస్పై కామెంట్స్ చేశారు. తాజాగా కాంగ్రెస్ సర్కారుపై నమ్మకం కలిగేలా బాండ్ పేపర్ రాసి దేవాలయం మందు ప్రమాణం చేయడం చర్చకు దారితీసింది.
ప్రజల్లో జగన్‌పై నమ్మకం పోయింది.. అందుకే విజయసాయి రాజీనామా: Sharmila
YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) ఇవాళ తన పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా(Resignation) సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాపై APCC నేత వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. మాజీ సీఎం, YCP…