Mana Enadu: జమ్మూకశ్మీర్, హరియాణా(Jammu & Kashmir, Haryana) ఎన్నికల ఫలితాలు(Election results) థ్రిల్లర్ సినిమాను సృష్టించాయి. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు తెలంగాణ పాలిటిక్స్(Telangana Politics)పై ప్రభావం చూపాయి. పక్కా విజయం ఖాయం అనుకున్న హరియాణాలో హస్తం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. జాట్, దళిత్, మైనార్టీ ఓట్లపై కాంగ్రెస్(Congress) పెద్దలు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. రివర్స్ ఫలితాల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ బ్రేక్ ఇచ్చింది. ఆచితూచి కేబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సామాజిక వర్గాల వారిగా కేబినెట్ కూర్పు ఉండాలని భావిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్(CM Revanth)తో పార్టీ పెద్దలు చర్చించినట్లు సమాచారం. దసరా తర్వాతే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు టాక్.
ఈసారి ఆరుగురికి అవకాశం
అయితే మంత్రి వర్గంలో ఈసారి ఆరుగురికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. మళ్లీ ఒకటి లేదా రెండు శాఖలను పెండింగ్(Pending)లో పెట్టనున్నట్లు హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేబినెట్ విస్తరణలో ఇద్దరు BCలు, ఒక మైనారిటీ, ఒక SC, ఇద్దరు OCలకు అవకాశం ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. బీసీలలో ముదిరాజ్ కమ్యూనిటీకి బెర్తు ఖాయంగా కనిపిస్తుంగా.. యాదవ సామాజిక వర్గం నుండి కురుమ లేదా మున్నూరు కాపుకు ఈసారి కేబినెట్లో అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. OCల నుంచి ఒక రెడ్డి, ఒక వెలమకి కేబినెట్‌లో ఛాన్స్ ఇవ్వనుంది. మరోవైపు కేబినెట్ బెర్తు కోసం చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
వీరికి మంత్రివర్గంలో ఛాన్స్?
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఒక్కోసారి ఒక్కో కొత్త వ్యక్తి పేరు బయటికొస్తోంది. తాజా జాబితాలో వాకిటి శ్రీహరి ముదిరాజ్, పి.సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్‌లకు మంత్రి పదవులు దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఆశావాహుల్లో మల్‌రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వడంపై ఆలోచిస్తున్నారు. అయితే కొత్తగా తెరపైకి సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, అజారుద్దీన్ పేర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో T Congress కేబినేట్ కూర్పు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరి మంత్రి వర్గంలో అధిష్ఠానం సీటు కైవసం చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.