Mana Enadu: ప్రజెంట్ ట్రెండ్ మారింది. చాలా మంది బిజీలైఫ్‌లో ఇంట్లో వంట చేయడమే తగ్గించేశారు. స్విగ్గీనో, జొమాటో(Swiggy, Zomato)లోనో ఆర్డర్ చేయడం, వీలైతే స్ట్రీట్ ఫుడ్(Street food) తీసుకొచ్చి తినడం అలవాటైపోయింది. దీంతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్‌లతోపాటు స్ట్రీట్ ఫుడ్ సెంటర్లూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో గల్లీకో టిఫిన్ సెంటర్(Tiffin Centre) ఉంటోంది. కర్రీ పాయింట్‌లు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శుభ్రత పాటించడం కూడా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్(Telangana Govt) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సురక్షిత ఆహారాన్ని అందించేందుకు వీధుల్లో ఆహారాన్ని విక్రయించే వ్యాపారులందరినీ ఆహార భద్రతా ప్రమాణాల చట్టం (FSS) పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారం స్ట్రీట్ ఫుడ్ వెండర్స్(Street Food Vendors) అందరూ రిజిస్ట్రేషన్(Registration) చేయించుకోవడం తప్పనిసరి.
హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు
ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త చట్టం ప్రకారం వీధుల్లో ఇడ్లీ, పానీపూరి బండితో సహా అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. అయితే ముందుగా ప్రయోగాత్మకంగా హైదరాబాద్(HYD) మహానగరంలో దీనిని అమలు చేయనున్నారు. ఆ తర్వాత మిగతా జిల్లాలు, పట్టణాల్లోని వ్యాపారులకు వర్తింపజేస్తారట. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది వీధి వ్యాపారులకు గుర్తింపు దక్కనుంది. అలాగే ఆహార నాణ్యతా మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేల ఈవిధానం అమలైతే దేశంలోనే తొలిసారిగా వీధి ఆహార వ్యాపారులందరికీ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలువనుంది.
అందుకు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు
అయితే వ్యాపారులు రిజిస్టేషన్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఆహార భద్రతా విభాగం అధికారులే ఈ స్ట్రీట్ వెండర్స్ వద్దకు వస్తారట. వారి ఆధార్ కార్డు ఆధారంగా అప్పటికప్పుడే రిజిస్టేషన్ చేసి సర్టిఫికేట్(Certificate) ఇస్తారు. ఇందుకోసం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఏటా దీనిని అంతే మొత్తం చెల్లించి రెన్యువల్(Renual) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఇప్పటికే భారత జాతీయ వీధి వ్యాపారుల సంఘం (NASVI) సహకారం, నెస్లే ఇండియా(Nestlé India) స్పాన్సర్‌షిప్‌తో ఇప్పటికే హైదరాబాద్‌లో 3 వేల మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారట. దీంతో వ్యాపారులపై అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు బ్యాంకుల నుంచి లోన్స్(Bank Loans) పొందే అవకాశం కూడా లభిస్తుంది. ఇక GHMC, మున్సిపల్(Municipal), పోలీసు(Police) విభాగాల నుంచి వేధింపులు కూడా ఉండవని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.