Hyderabad | కత్తితో తల, మొండెం వేరు చేసి ఎస్కేప్​ అవ్వబోతుండగా..

మన ఈనాడు: రక్తం మరకలతో ఉన్న వ్యక్తిని ఓ యువకుడు పట్టుకున్నాడు. డయల్​ 100కి సమాచారం ఇచ్చాడు. పోలీసులు విచారణలో ఏకంగా భార్య తల, మొండెం వేరు చేసి ఎస్కేప్​ అవ్వబోతున్నాని చెప్పాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జి ల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణా పరిధిలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో మంగళవారం చోటుచేసుకున్నది. పురాణాపూల్‌కు చెందిన పుష్పలత అలియాస్‌ సువర్ణ (42)తో సికింద్రాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్‌కు 2009 లో పెండ్లి జరిగింది.

అనుమానంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. కత్తితో తల, మొండెం వేరు చేసి అతి దారుణంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణా పరిధిలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో మంగళవారం చోటుచేసుకున్నది. పురాణాపూల్‌కు చెందిన పుష్పలత అలియాస్‌ సువర్ణ (42)తో సికింద్రాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్‌కు 2009 లో పెండ్లి జరిగింది. పుష్పలత కంటే విజయ్‌ వయసులో ఆరేండ్లు చిన్న. పుష్పలతకు ఇది మూడోది, విజయ్‌కి తొలి వివాహం.

విజయ్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. సరూర్‌నగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో వీరు నివసించారు. 2 నెలల కిందటే జేఎన్‌ఎన్‌యూఆర్‌ం కాలనీలోకి మారారు. చాలాకాలంగా పుష్పలత ప్రవర్తనపై తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. విజయ్‌పై పుష్పలత మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో గృహ హింస కేసు పెట్టింది. పుష్పలతపై విజయ్‌ అనుమానం పెంచుకున్నాడు. చెప్పినా ఆమె తీరు మార్చుకోకపోవడంతో ఆమెను చంపాలని విజయ్‌ నిర్ణయించుకున్నాడు. మంగళవారం అదే కాలనీలోని డబుల్‌ బెడ్రూం ఇండ్ల సముదాయంలోని తన సోదరి ఫ్లాట్‌ను శుభ్రం చేసేందుకు పుష్పలతను తీసుకెళ్లాడు. అప్పటికే సిద్ధం చేసుకున్న కత్తితో ఆమెను చంపేశాడు. కత్తితో తల, మొండెంను వేరుచేసి అతి దారుణంగా హత్య చేశాడు. తల్లి మరణం, తండ్రి జైలు పాలవ్వడంతో 13 ఏండ్ల కొడుకు, తొమ్మిదేండ్ల కుమార్తె ఇద్దరు అనాథలయ్యారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిసింది.

Share post:

Popular