Hyderabad: ‘రెరా’ కార్యదర్శి బాలకృష్ణ అరెస్టు.. ఏసీబీ సోదాల్లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన అధికారులు

మన ఈనాడు: HMDA టౌన్‌ ప్లానింగ్‌ విభాగం మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్థుల కేసు నమోదు కావడంతో గురువారం తెల్లవారుజామున పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. తన పదవిని ఆసరగా చేసుకుని వందల కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యదర్శి, HMDAటౌన్‌ ప్లానింగ్‌ విభాగం మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో బుధవారం ఉదయం నుంచి అవినీతి నిరోధక శాఖ సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురవారం తెల్లవారుజామున 3 గంటలకు ఏసీబీ (ACB)అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. బుధవారం నిర్వహించిన సోదాల్లో బాలకృష్ణకు సంబంధించి రూ.100 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి.
బాలకృష్ణ గతంలో HMDA ప్రాణళిక విభాగం డైరెక్టర్‌గా ఉంటూనే.. మరోవైపు ఎంఏయూడీ (పురపాలన, పట్టణాభివృద్ధి విభాగం)లో ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. హెచ్‌ఎంఏ నుంచి దస్త్రాలను ఆయనే పంపించేవారు. ఎంఏయూడీలో డైరెక్టర్ కూడా ఆయనే కాబట్టి వాటికి జీవోలిచ్చేవారు. ఈయన మేడ్చల్, మెదక్, రంగారెడ్డి, భువనగిరి, సంగారెడ్డి.. తదితర 7 జిల్లాలోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. HMDA పరిధి జోన్లలో ఉన్న రూల్స్‌ను ఆసరగా చేసుకొని వందల దరఖాస్తులకు ఆమోదముద్ర వేసేందుకు భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఏం చెప్పారంటే

ఆయన గతంలో HMDA మాజీ ప్లానింగ్ డైరెక్టర్… ప్రస్తుతం మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్ , రెరా సెక్రటరీ గా పని చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.సమీప బంధువులు , ఆయన స్నేహితులు , కొలీగ్స్ ఇండ్లల్లో 17 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు.ఆయన ఇంట్లో 84 లక్షల 60 వేలు నగదు , 2 కేజీలు బంగారం , 5.5 కేజీలు వెండి , 32 లక్షలు విలువ చేసే వాచ్‌లు , 3 విల్లాలు , 3 ఫ్లాట్స్ , 90 ఏకరాల భూమికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.ఆయన పేరుతో పాటు బినామీల పేరుపై ఉన్నట్లు తేల్చారు. మార్కెట్ విలువ ప్రకారం భూముల విలువ సుమారు 60 కోట్లు ఉంటుందన్నారు.మొత్తం ప్రాపర్టీస్ విలువ రూ.75 కోట్లు ఉంటుంది.ఈ సోదాలు మరో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయి.కొన్ని విషయాలు ఆయన చెప్పలేదు… మా విచారణకు సహకరించలేదు.కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *