
విద్యార్థులకు అలర్ట్. తెలంగాణ ఎప్సెట్ (Telangana EAPCET 2025) నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి రిలీజ్ చేసింది. TG-EAPCET దరఖాస్తులు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్లో ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ పరీక్ష (Engineering) నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 29, 30వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
25 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ (Agriculture) విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎప్సెట్ పై సమావేశం నిర్వహించిన తర్వాత జేఎన్‌టీయూ హైదరాబాద్, ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా షెడ్యూల్ ఖరారు చేశాయి. అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ను ప్రకటించింది. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుండగా.. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
KCR : ‘తెలంగాణలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం’
‘నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది.’ ఓ సినిమాలో తలైవా రజినీ కాంత్ చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పుడు అచ్చం ఇదే డైలాగ్ ను కాస్త అటూ ఇటూగా మార్చి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…