మన ఈనాడుఃనిజాం కాలేజీ విద్యార్థులు ధర్నాకు దిగారు. హాస్టల్ లో సరైన వసతులు లేవని, ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు చెప్పినా తమ గోడు పట్టించుకోవట్లేదంటూ హైదరాబాద్ లోని బషీర్ బాగ్ చౌరస్తాలో నడిరోడ్డుపై నిరసన చేపట్టారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
నిజాం కాలేజీ విద్యార్థులు ధర్నాకు దిగారు. హాస్టల్ లో సరైన వసతులు లేవని, ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు చెప్పినా తమ గోడు పట్టించుకోవట్లేదంటూ హైదరాబాద్ లోని బషీర్ బాగ్ చౌరస్తాలో నడిరోడ్డుపై నిరసన చేపట్టారు.
ఈ మేరకు గత వారం రోజులుగా హాస్టల్ లో సరిగ్గా ఫుడ్ సరిగా లేదని, పెట్టిన భోజనం కూడా తినలేకపోతున్నామని విధ్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని, దీంతో వారం రోజులుగా బయట నుండే ఫుడ్ తెచ్చుకొని తింటున్నామంటున్న విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైటాయించడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కొంతమందికి నచ్చజెప్పి రోడ్డుమీదనుంచి పక్కకు రప్పించగా.. మరికొంతమంది విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు అబిడ్స్ పోలీసులు తెలిపారు.