HYD:గులాబీ ముళ్లే..ఉప్పల్​ ‘హస్తం’కి కలిసొస్తుందా..?

మన ఈనాడు:

ఉప్పల్​ నియోజకవర్గంలో గులాబీ ముగ్గురు నాయకులపై ఉన్న అసంతృప్తితోనే కాంగ్రెస్​ పార్టీకి ఊహించని విజయం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.ప్రత్యర్థులను ఎదుర్కొనే గులాబీ బాస్ బక్కపలచని నాయకత్వంలో ఉన్న సత్తానే..ఉప్పల్​ కాంగ్రెస్​ అభ్యర్థి అంతకంటే ఎక్కువ సత్తా చూపిస్తున్నారు.

కాంగ్రెస్​ పార్టీ నుంచి టిక్కెట్​ ఆశించి భంగపడిన ఇద్దరు కీలక నేతలు బీఆర్​ఎస్​ అభ్యర్థికి మద్దతు పలికారు. గులాబీలోనూ ముగ్గురు నేతలు ఎమ్మెల్యే రేసులో ఉన్నా ఫలితం దక్కలేదు. పైకి మద్దతు ఇస్తున్నా..అసంతృప్తి మాత్రం అలాగే ఉన్నట్లు తెలుస్తుంది.కాషాయం మాజీ ఎమ్మెల్యే గతంలో నేను చేసిన అభివృద్ధే అని చెబుతున్న అందులోనే అరడజను మంత్రి టిక్కెట్​ ఆశించారు.

గ్రేటర్​ హైదరాబాద్​లో కారు జోరు మీద ఉందనే ప్రచారం జరుగుతుంది. ఉప్పల్​ నియోజకవర్గం మాత్రం రోజురోజుకూ హీట్​ ఎక్కుతుంది. లక్ష మెజార్టీతో గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్న గులాబీ అభ్యర్థికి నాలుగు గ్రూపల నేతలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సహకరిస్తారనే బెంగ పట్టుకుంది.

RRR సినిమాను తలపించేలా ఉప్పల్​లో BBB ఫీవర్​ పట్టుకుంది. బేతి, బొంతు, బండారి ఈ ముగ్గురు అనుచరులు పైకి చేతులు కలిపి..ప్రచారం చేసినా..వెనక ‘మాత్రం’ చేతి గుర్తుకు కలిసొచ్చేలా ఉన్నట్లు తెలుస్తుంది. బీఆర్​ఎస్​ కార్యకర్తలు ఈముగ్గురు నేతలు పట్ల అసంతృప్తిగా ఉన్నారనే సమాచారం.

ఉప్పల్ ప్రాంత ప్రజలు కార్పొరేటర్​ అవకాశం ఇవ్వడంతో పనితీరు చూపించానని కాంగ్రెస్​ అభ్యర్థి మందముల అంటున్నారు. మరోసారి MLAగా అవకాశం వచ్చింది..మరోసారి దీవించండి ఉప్పల్​ అభివృద్ధి రాష్ర్టానికి ఆదర్శంగా నిలిపేలా చేస్తానని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఇక్కడ ఉండే సెటిలర్​ ఓటర్స్​ ఎక్కువ. బీజేపీ లేదా కాంగ్రెస్​ ఓట్లు పడే అవకాశం ఉంది. గులాబీ సొంతపార్టీ నేతలే అసంతృప్త క్యాడర్​ హస్తం వైపు చూస్తున్నారు.

Share post:

లేటెస్ట్