మన ఈనాడుః
అధికారం బలం..ఆర్థికబలం..గులాబీ అభ్యర్థి బలాలు..కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జనం బలం కోరుకున్నాడు..వారి అడుగులు తనతో కలిసి రావాలని సంకల్సంతో ముందుకెళ్లాడు..వెరసి ఉప్పల్ నియోజవర్గంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు చేస్తున్నప్రచారం ఊపందుకుంది.ఈరోజు ప్రకటించిన బీజేపి అభ్యర్థి ఎన్‌వీఎస్ఎస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేఖత తాను ఎమ్మెల్యేగా చేసిన పనులే తనను గెలిపిస్తాయని నమ్ముకుని ప్రచారం చేయబోతున్నారు.
ఉప్పల్ ప్రజలు తీర్పు చరిత్రేః
2009లో ఉప్పల్ అసెంబ్లీ ఏర్పడిన నాటి నుంచి ఓటర్లు భిన్నమైన తీర్పుతో ఇస్తూ వస్తున్నారు. మొదట కాంగ్రెస్ పట్టాభిషకేం చేశారు.2014కాషాయం పార్టీకి అవకాశం ఇచ్చారు. 2018లో కారును గెలిపించి చైతన్యవంత ఓటర్లుగా ఉంటామని పార్టీలకు స్పష్టం చేశారు. తాజాగా 2023లో జరిగే ఎన్నికల్లో నాయకులంతా అధికారపార్టీలో ఉన్నారు. ముందు నుంచి జనంతో కలిసి అడుగులు వేసిన మందముల పరమేశ్వరరెడ్డి పనితీరును గుర్తించి కాంగ్రెస్ పెద్దలు టీక్కెట్ ఇచ్చి ప్రొత్సహించారు.
గ్రౌండ్ లెవల్ ప్రచారంలో హస్తం ముందుంజ
తెల్లవారుజామన నిద్ర లేచిన నుంచి రాత్రి పొద్దపోయే వరకు ఒంటరిగా జనాన్ని కలవడం హస్తం పార్టీ అభ్యర్థి చేస్తున్నారు. రోడ్లపై తిరుగుతూ ప్రజలన్ని ఇబ్బందులు పెట్టకుండా జనం ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి సామన్యుడిగా జనంలోకి వచ్చా..ఒక్క అవకాశం ఇచ్చి చూడండి..ప్రజల మెచ్చిన ప్రజాప్రతినిధిగా చెరగని ముద్ర వేసుకుంటానని చేస్తున్న ప్రచారంతో ప్రజల మనస్సు గెలుస్తున్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీజీపీ మధ్యనే పోటీ ఉండబోతుందని జనం భావిస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థి ఆర్థిక బలంతో జనంలోకి వస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారనే విమర్శలు సొంతపార్టీ క్యాడర్‌లోనే ఉత్పన్నం అవుతుంది.
దీంతో కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వరరెడ్డికే ప్రజలు పట్టాభిషేకం చేయబోతున్నారని తెలుస్తుంది.