సైనికుడిలా ముందుంటాం..కాంగ్రెస్​ను గెలిపించుకుంటాం!

మన ఈనాడు:

సైనికుడిలా ముందుంటాం..కాంగ్రెస్​ను గెలిపించుకుంటాం..5వారాలు ప్రజల్లోనూ ఉంటూ సైనికుడిలా పనిచేస్తాం..ప్రజలకు కాంగ్రెస్​ చేయబోతున్న 6గ్యారంటీలను వివరించి ఉప్పల్​ కాంగ్రెస్​ అభ్యర్థి మందముల పరమేశ్వరరెడ్డిని గెలిపించుకుంటామని కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు నెమలి అనీల్​ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక రాష్ర్టం ప్రకటిస్తే సీఎం కేసీఆర్​ కుటుంబపాలనతో రాష్ర్ట ప్రజలకు కన్నీళ్లు మిగిల్చాడని ఆవేదన వ్యక్తం చేశారు.

పదేళ్లుగా రాష్ర్ట ప్రజలను వంచిస్తూ..ఆశలతో ప్రజల మనుగడపై దెబ్బతీశారని ఆరోపించారు. పథకాల మాటున ప్రజలను వంచించాలని చూసిన కుటుంబ పాలనకు మరో 5వారాల్లో జనం సంచలన తీర్పు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. ఉప్పల్​ గడ్డపై కాంగ్రెస్​ జెండా ఎగురేస్తాం..కుటుంబపార్టీతోపాటు వలసల నేతలకు చెక్​ పెట్టి కాంగ్రెస్​ సత్తా ఎంటో చూపించబోతున్నామని పేర్కొన్నారు.
ప్రతి గడపలో కాంగ్రెస్​ అభ్యర్థి పరమేశ్వరరెడ్డి(MPR) ప్రచారంలో ప్రజల ఇందిరమ్మ రాజ్యాన్ని గుర్తు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్​కు అవకాశం ఇవ్వాలి..తెలంగాణ రాష్ర్టాన్ని కాపాడుకోవాలని ప్రజలే కంకణం కట్టుకున్నారన్నారు. వలస నేతలంతా ఒకపార్టీలో ఉండి..ఓడించాలని చేస్తున్న కుట్రలను ఉప్పల్​ ప్రజలు తిప్పికొట్టబోతున్నారని జోస్యం చెప్పారు.

Related Posts

కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. జారీ అప్పుడే!

Mana Enadu:తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. అందులో భాగంగా ఎన్నికలకు ముందు ప్రకటించినట్లుగానే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తోంది. ఉచిత బస్, ఆరోగ్య శ్రీ లిమిట్ పెంపు, 200యూనిట్ల ఫ్రీ కరెంట్ వంటి పథకాలను…

TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. ఆ భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు పునరుద్ధరణ..!

TTD: రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లపై టీటీడీ ఈఓ సమీక్ష నిర్వహించింది. ప్రత్యేక దర్శనం టికెట్లను వివిధ గవర్నమెంట్ శాఖల అధికారులకు ఇవ్వాలా వద్దా అన్నదానపై చర్చ నడుస్తోంది.ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఇవ్వాల్సి వస్తే ఏ ప్రాతిపదికన కల్పించాల్సి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *