
డీఎస్సీ-2008 (DSC 2008) అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఆ ఏడాది డీఎస్సీ నియామకాల్లో నష్టపోయిన వారిలో 1,382 మంది బీఈడీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. మరో వారం రోజుల్లో కాంట్రాక్టు విధానంలో వీరిని సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT)లుగా నియమించనున్నట్లు తెలిపింది. దీనికోసం ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు వెల్లడించింది.
ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ
ఉమ్మడి ఏపీలో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో మంచి మార్కులు సాధించి, మెరిట్ జాబితాలో ఉన్నా బీఈడీ అభ్యర్థులు (BEd Candidates) ఉపాధ్యాయ ఉద్యోగాలకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నష్టపోయిన తమకు న్యాయం చేయాలని నాటి నుంచి వారు పోరాడుతూనే ఉండగా.. తాము అధికారంలోకి వస్తే వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ (Congress Party) గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది.
కాంట్రాక్టు విధానంలో
ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన అనంతరం వారికి కాంట్రాక్టు విధానంలో మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేస్తూ ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) 2024 సెప్టెంబరు 24న నిర్ణయం తీసుకుంది. 2008 డీఎస్సీ నోటిఫికేషన్లో నష్టపోయిన అభ్యర్థులు మొత్తం 2,367 మంది ఉన్నట్లు గుర్తించింది. కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT)గా పని చేయాలని విద్యాశాఖ కోరగా.. 1,382 మంది అభ్యర్థులు కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి అంగీకరించారు.
హైకోర్టుకు అభ్యర్థులు
వీరికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు విధివిధానాల రూపకల్పన చేసే ఫైల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నెల రోజుల క్రితమే ఆమోదం తెలపినా.. ఉద్యోగాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతుండటంతో అభ్యర్థులు హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో స్పందించిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దిగొచ్చిన సర్కార్.. మరో వారంలో ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమైంది.
KCR : ‘తెలంగాణలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం’
‘నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది.’ ఓ సినిమాలో తలైవా రజినీ కాంత్ చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పుడు అచ్చం ఇదే డైలాగ్ ను కాస్త అటూ ఇటూగా మార్చి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…