
తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు (Group 1 Exams) రాసిన అభ్యర్థులకు అలర్ట్. మరికాసేపట్లో గ్రూపు-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇవాళ్టి ఫలితాల్లో కేవలం మెయిన్స్ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ప్రాథమిక మార్కుల వివరాలను మాత్రమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వెల్లడించనుంది.
కాసేపట్లో గ్రూపు-1 ఫలితాలు
మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ జరుగుతోంది. ఇందుకు సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 27వ తేదీ నిర్వహించారు. మొత్తం 7 పేపర్లకు అభ్యర్థులు పరీక్షలు రాశారు. గ్రూపు-1 ప్రిలిమ్స్ (Group 1 Prelims)లో 31,383 మంది క్వాలిఫై అవ్వగా.. మెయిన్స్ పరీక్షలకు మాత్రం 21,093 మంది మాత్రమే హాజరయ్యారు.
ఫలితాలు ఇలా చెక్ చేస్కోండి
ఇక ఫలితాల వెల్లడిలో భాగంగా తొలుత ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో గ్రూప్-1 తుది నియామక ప్రక్రియ షురూ కానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత చేపట్టిన మొట్ట మొదటి గ్రూప్ 1 నియామకాలు కావడంతో ఈ ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.