ఈ నేపథ్యంలో పిటిషన్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ రైతు కూలీలు ఎక్కడ ఉన్నా అందరూ సమానమేనని, గ్రామాల్లో వారికే వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం అని పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, నాలుగు వారాల్లో పురపాలికల్లో రైతు కూలీలను కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కిందకు తీసుకుని లబ్ధి చేకూర్చాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది.







