ManaEnadu:హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనాలు పూర్తయ్యాక.. ఆదివారం మరోసారి ఆక్రమణల కూల్చివేతలను ప్రారంభించింది హైడ్రా. నగరంలోని మూడు ప్లేసుల్లో ఏకకాలంలో కూల్చివేతలు చేయడం జరిగింది. ప్రధానంగా నల్లచెరువు ప్రాంతంలో దాదాపు 16 షెడ్లను కూల్చేశారు. నల్లచెరువుకు సంబంధించి మొత్తం 27 ఎకరాలు బఫర్ జోన్ లో ఉండగా అందులో దాదాపుగా 8 ఎకరాల వరకు కబ్జా అయినట్లు గుర్తించిన అధికారులు.. ఇప్పుడు 16 నిర్మాణాలను కుప్పకూల్చారు. తద్వారా 4 ఎకరాల ల్యాండ్ ను స్వాధీనం చేసుకున్నట్లైంది.
అక్రమ కట్టడాలపై మరోసారి కొరడా ఝళిపించింది. ఆదివారం పలు చోట్ల ఆక్రమణలను నేలమట్టం చేసింది హైడ్రా. ఎన్ని చోట్ల అక్రమ కట్టడాలు నేలమట్టం చేశారు, ఎన్ని ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.. ఈ వివరాలన్నీ తెలియజేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఆదివారం మూడు ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 8 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కూకట్ పల్లి నల్లచెరువు దగ్గర 16 సెంట్లు, ఇతర నిర్మాణాలను కూల్చేశారు. నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు. కాగా, హైడ్రా 4 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేటలోనూ మూడు నిర్మాణాలను నేలమట్టం చేశారు. తద్వారా అక్కడ ఎకరం ల్యాండ్ ని స్వాధీనం చేసుకున్నారు. పటేల్ గూడలోనూ 25 అక్రమ నిర్మాణాలు కూల్చేసి 3 ఎకరాల ల్యాండ్ ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.