TG Inter: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. రేపే ఫలితాలు

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు(Telangana Intermediate Results) రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఫలితాలను ప్రకటించనున్నారు. కాగా రాష్ట్రంలో ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చ్ 5 నుంచి 25 వరకు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయ్యాయని, రెండోసారి వెరిఫికేషన్(Verification) కూడా పూర్తి చేసి మార్కుల కంప్యూటరీకరణ చేపట్టినట్లు ఇంటర్మీడియట్ బోర్డు(Intermediate Board) తెలిపింది.

అధికారిక వెబ్‌సైట్‌లో..

కాగా విద్యార్థులు తమ రిజల్ట్స్‌(Results)ను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in.లో చెక్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్(Hall Ticket Number), పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మార్క్స్ మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *