Mana Enadu: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత(MlC Kavitha) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు కవిత ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. బెయిల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హై కోర్టు…జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన బెంచ్ విచారణ చేపట్టనుంది. తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును.. ఢిల్లీ హైకోర్టులో కవిత సవాల్ చేసింది.