Road Accident at Rangareddy : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమనగల్లు మండలం రాంనుంతల గ్రామ శివారులోని హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన కారు కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తుంది. ఇందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు శివకృష్ణ వరప్రసాద్ గౌడ్ (35), నిఖిల్ (26), మణిదీప్ (25)లను హైదరాబాద్లోని కర్మన్ఘాట్ వాసులుగా గుర్తించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను జేసీబీ సాయంతో వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Video Viral : రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప పగులగొట్టిన ఈటల
పేదల భూములను ఆక్రమించిన ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై మల్కాజిగిరి ఎంపీ (Malkajgiri MP) ఈటల రాజేందర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. సంయమనం కోల్పోయిన ఆయన ఒక్కసారిగా బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. వెంటనే ఆయన వెంట వచ్చిన బీజేపీ నేతలు,…