Mana Enadu: తల్లిదండ్రుల మీద అలిగి ఇంటి నుంచి పారిపోయిన సదరు బాలిక ఓ దుండగుడి చేతిలో లైంగిక దాడికి గురైంది. ఈ విషాదకర సంఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు (Secunderabad)చెందిన (16) ఏండ్ల బాలికను తల్లిదండ్రులు ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతుందని, అది మంచి పద్ధతి కాదని మందలించారు. దీంతో తల్లిదండ్రులపై కోపంతో ఇంటి నుంచి పారిపోయింది.
ఇదే క్రమంలో అప్పుడే పరిచయమైన ర్యాపిడో(Rapido Driver) డ్రైవర్ సందీప్‌రెడ్డి(28)బాలికకు మాయమాటలు చెప్పి కాచిగూడలోని(Kachiguda) ఓ లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికి చేరుకున్న బాలికను నిలదీయగా జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి సీసీ పూటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.