ACP Umamaheshwar Rao: ఏసీపీ ఉమామహేశ్వర్‌రావుకు జూన్ 5 వరకు జ్యుడీషియల్ రిమాండ్
TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఈ క్రమంలో ఉమామహేశ్వరరావును చంచల్‌గూడకు తరలించారు పోలీసులు.
ACP Umamaheshwar Rao: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. జూన్ 5వరకు అతనికి రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఉమామహేశ్వరరావును చంచల్‌గూడకు పోలీసులు తరలించారు. ఉమామహేశ్వరరావు నుంచి రూ. 3 కోట్లకు పైగా విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఘట్‌కేసర్‌లో 5 ఇళ్లస్థలాలు, శామీర్‌పేటలో విల్లా ఉన్నట్లు గుర్తించారు.
సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్ రావును అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ సోదాల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు. రూ.38 లక్షలు, 60 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం అతని వద్ద రూ.40 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. దీని ప్రభుత్వ విలువ రూ.3 కోట్ల 40 లక్షలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రేపు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. మొత్తం 11 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.