Mana Enadu: ఇక ఈ స్పెషల్ వెహికల్ ని మూవీ టీమ్ మహీంద్రా కంపెనీతో కలిసి తయారు చేసింది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 7 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. ఈవెంట్ లో ప్రభాస్ స్వయంగా ఈ వెహికల్ ని నడుపుకుంటూ వచ్చి గ్రౌండ్ లో రౌండ్స్ కొట్టాడు. దీంతో ప్రభాస్ అభిమానులు అంతా ఆశ్చర్యపోయారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
Kalki Bujji Glimpse : కల్కి సినిమా నుంచి భైరవ(ప్రభాస్ పాత్ర పేరు) నడిపే వెహికల్ బుజ్జికి సంబంధించిన గ్లింప్స్ ని నిన్న రాత్రి రిలీజ్ చేసారు. గ్రాండ్ గా కల్కి (Prabhas Kalki)బుజ్జి ఈవెంట్ అని రామోజీ ఫిలిం సిటీలో(Ramoji Film City) ఏర్పాటు చేసి ఈ గ్లింప్స్ ని వదిలారు. కల్కి సినిమాలో ప్రభాస్ వాడే వెహికల్ ఇదే. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసినట్టు గ్లింప్స్ లో చూపించారు. మీరు కూడా బుజ్జి గ్లింప్స్ చూసేయండి.