Mana Enadu: యేవమ్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే వికారాబాద్ లో వరుసగా జరుగుతున్న హత్యలు, అక్కడ పోలీస్ గా జాయిన్ అయిన చాందిని ఏం చేసింది అనే ఆసక్తికర థ్రిల్లింగ్ అంశంతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ టీజర్ ని హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. యేవమ్ టీజర్ మీరు కూడా చూసేయండి..
Yevam Teaser : చాందిని చౌదరి వరుసగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వరుస హిట్స్ కొడుతుంది. ఇటీవల గామి సినిమాతో హిట్ కొట్టిన చాందిని త్వరలో మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాతో రాబోతుంది. ఆ తర్వాత యేవమ్ అనే సినిమాతో రాబోతుంది. నవదీప్, పవన్ గోపరాజు నిర్మాణంలో ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యేవమ్. ఈ సినిమాలో చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్ రాజ్, అషురెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
మీ సినిమా ఓపెనింగ్‌కు వచ్చిన నేను మళ్లీ మీ చిత్రం టీజర్ విడుదల చేయడం హ్యపీగా వుంది. యేవమ్ చాలా మంచి టైటిల్. మీ ప్రమోషన్ కంటెంట్ చూస్తుంటే చిత్రం కూడా కొత్తగా వుంటుందని అనిపిస్తుంది.టీజర్ చాలా ఇంప్రెసివ్‌గా వుంది. మీకు ఆల్ దిబెస్ట్ అంటూ హరీశ్ శంకర్ యేవమ్ టీజర్‌ను లాంచ్ చేసి యేవమ్ టీమ్‌ను సపోర్ట్ చేసి సినిమా సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్ అండ్ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో వున్నాం. మా టీజర్‌ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేయడం ఆనందంగా వుంది.