Parakramam| చిరు అభిమాని ‘పరాక్రమం’ డైరెక్టర్​… సినిమా టీజర్ రిలీజ్

Mana Enadu: బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శనివారం ‘పరాక్రమం’ సినిమా టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు.

టీవీలో చిరంజీవిని చూశాకే నాకు సినిమా గురించి తెలిసింది. ఆ తర్వాత ఇళయరాజా, సిరివెన్నెల సీతారామశాస్త్రి, పీసీ శ్రీరామ్, శ్రీకర్ ప్రసాద్ ఇలాంటి వాళ్లంతా నన్ను ఇన్స్ పైర్ చేశారు. వీళ్లందరినీ స్ఫూర్తిగా తీసుకుని నాలోని సహజమైన ప్రతిభను మెరుగుపర్చుకుంటూ వచ్చాను. 20 ఏళ్ల పాటు రెగ్యులర్ లైఫ్ కు దూరంగా ఉండిపోయా. నేను దర్శకుడిగా రెండు తమిళ చిత్రాలు, ఒక తెలుగు సినిమా చేశా. అవి మూడూ డిజాస్టర్స్ అయ్యాయి. నేనొక ఫెయిల్యూర్ డైరెక్టర్ నని తెలుసుకున్నా. అప్పుడు నేనే నటించాలని డిసైడ్ అయ్యి నిర్భందం, నిర్భందం 2, మాంగళ్యం సినిమాలు చేశాను.

Mass ka Das Viswak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ – నేను యానిమేషన్ ఎడిటింగ్ కోర్సులు చేస్తున్నప్పటి నుంచి మా సర్కిల్స్ లో బండి సరోజ్ కుమార్ పేరు వింటున్నా. ఆయన తమిళ్ లో పోర్కాళం అనే ఒక సినిమా చేశారు. ఆ సినిమా ఆడలేదు గానీ ఆ మూవీని బాగా ఇష్టపడే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఉన్నారు. కోవిడ్ టైమ్ లో బండి సరోజ్ కుమార్ నిర్భందం ట్రైలర్ చూసి ఆయనకు మెసేజ్ పంపాను. మీరు ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించాలని అనుకుంటున్నారు. నాకు నచ్చింది అని చెప్పాను. పరాక్రమం ట్రైలర్ చాలా బాగుంది. సరోజ్ కుమార్ డైరెక్టర్ కంటే నటుడిగా బాగా పర్ ఫార్మ్ చేస్తున్నాడు. ఆయన సినిమాకు టీమ్ అంటే ఆయనే. ఒక ఎనిమిది మంది పని బండి సరోజ్ కుమార్ చేస్తుంటాడు. ఆల్ ది బెస్ట్ అన్నా. అన్నారు.

డైరెక్షన్ ఒక్కటి చేయడమే కష్టమంటే మీరు ఇన్ని క్రాఫ్ట్స్ ఎలా చేస్తున్నారో ఆశ్చర్యంగా ఉంది. బండి సరోజ్ కుమార్ కల్ట్ మ్యాన్. ఆయన పోర్కాళం సినిమా నా ఫేవరేట్ మూవీ. పరాక్రమం సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు మోహన్ మాట్లాడుతూ సేనాపతి మాట్లాడుతూ – నా ఫ్రాంక్ నెస్ నచ్చి పరాక్రమం సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు బండి సరోజ్ కుమార్ . ఆయన ఆ తర్వాత మంచి మిత్రుడిగా మారారు. ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా అన్నారు

యాక్ట్రెస్ శృతి సమన్వి మాట్లాడుతూ – నేను క్లాసికల్ డ్యాన్సర్ ను. జాతీయ స్థాయిలో అవార్డ్ అందుకున్నా. పరాక్రమం సినిమాలో కీ రోల్ చేశాను. ఈ సినిమా నాతో పాటు మా టీమ్ అందరికీ విజయాన్ని అందిస్తుందని కోరుకుంటున్నా అన్నారు.

నటీనటులు : బండి సరోజ్ కుమార్, శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్, శశాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ తదితరులు

టెక్నికల్ టీమ్
బ్యానర్ : బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్, కథ, కథనం, మాటలు,ఎడిటర్, సంగీతం, లిరిక్స్, నిర్మాత, దర్శకుడు – బండి సరోజ్ కుమార్
సినిమాటోగ్రఫీ – వెంకట్ ఆర్ ప్రసాద్, వి ఎఫ్ ఎక్స్ : AYKERA studios, సౌండ్ డిజైన్ మరియు మిక్సింగ్ : కాళీ ఎస్ ఆర్ అశోక్
కలరిస్ట్ – రఘునాథ్ వర్మ, ఆర్ట్ : ఫణి మూసి, ఫైట్స్ – రాము పెరుమాళ్ల
డ్యాన్స్ – రవి శ్రీ, మోషన్ పిక్చర్ టైటిల్స్ – అనిల్ కుమార్ వై
పబ్లిసిటీ డిజైర్ : లక్కీ డిజైన్స్, లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ గూడూరి
పి ఆర్ ఓ : పాల్ పవన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : మన రాజు

Share post:

లేటెస్ట్