Kamineni:తలసేమియా వ్యాధికి..కామినేనిలో చికిత్స

Mana Enadu: ప్రపంచాన్ని వణికిస్తున్న తలసేమియా వ్యాధి రోగులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. జన్యుసమస్యతోపాటు ఎర్ర రక్తకణాలకు సంబంధించిన ప్రమాదకరమైన వ్యధిగా నిర్ధారించడం జరిగింది.

Kamineni: ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా తలసేమియా(talasemia) వ్యాధి నివారణ దిశగా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకోచ్చారు.తలసేమియా అత్యంత ప్రమాదకరమైన జన్యుసమస్య అని డా. సచిన్ జాదవ్​(Doctor Sachin​ Jadav)అన్నారు. రక్తంలోని ఎర్ర రక్త కణాలను సంబంధించిన వ్యాధితో రోగులు అనారోగ్యం భారీన పడి ప్రమాదకమైన పరిస్థితుల్లోకి వెళ్లే పరిస్థతి నెలకొందన్నారు.

ప్రధానంగా రెండు రకాలుగా తలసేమియా వ్యాధి ఉంటుందన్నారు. తల్లిదండ్రుల నుండి పిల్లలకు వారసత్వంగా సంక్రమించే వ్యాధిగా గుర్తించడం జరిగిందన్నారు. వీటితోపాటు విపరీతమైన అలసట నీరసంగా ఉంటుంది. చర్మం పాలిపోవడం ముఖం ఆకారంలో మార్పులు ఎదుగుదల లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. ఇటువంటి జబ్బులకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రల్లో కామినేని హాస్పిటల్ డాక్టరు వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

Share post:

లేటెస్ట్