
తెలంగాణ(Telangana)లో గ్రామాలు అతిపెద్ద పండగకు ముస్తాభవుతున్నాయి. ఇప్పటికే పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల(Gram Panchayat Elections) సందడి నెలకొంది. తమ ఊరిని బాగు చేసే నాయకుడెవరంటూ రచ్చబండల వద్ద జనం జోరుగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఈసారి తమ బాగోలు.. తమ ఊరి బాగోలు చూసే నాయకుడి(Leader)నే ఎన్నుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. మరోవైపు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో సర్పంచ్, MPTC, ZPTC అభ్యర్థులు, ఆశావహులు ఉన్నారు. బాబాయ్.. పెద్దయ్యా.. బాపూ.. తమ్ముడు.. అన్న.. అక్కా అంటూ వరుసలు కలుపుకొని మరి ప్రజలను ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన రావడమే తరువాయి నామినేషన్(Nomination) వేసేందుకు తహతహలాడుతున్నారు. అటు ఎన్నికల అధికారులు కూడా తుది ఓటరు జాబితాను రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికల(Local Bodie Elections)కు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
రిజర్వేషన్లపై స్పష్టత ఇస్తే 15 రోజుల్లోనే..
రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాల పాలన(Governance of Panchayat Governing Bodies) ముగిసి ఏడాది కావస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరలోనే నిర్వహించాలని సీఎం రేవంత్(CM Revanth) నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కీలకమైన BC రిజర్వేషన్లను తేల్చే ప్రక్రియ తుదిదశలో ఉంది. దీనిపై త్వరలోనే CM నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం క్యాబినెట్ భేటీ నిర్వహించి కులగణన నివేదిక(Census Report), బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్(BC Dedicated Commission Report) వంటివాటిపై చర్చించున్నారు. వీలైతే ఫిబ్రవరి 7న ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం(Assembly Meeting) నిర్వహించి సభలో వీటిపై చర్చించనుంది. అనంతరం ఫిబ్రవరి రెండో వారంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ చేసి మార్చి రెండో వారంకల్లా ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ప్రభుత్వం రిజర్వేషన్లపై స్పష్టత ఇస్తే 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
వచ్చే నెల 6లోపు సప్లిమెంటరీ ఓటర్ల తుది జాబితా
మరోవైపు పంచాయతీ ఎన్నికల కోసం గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా సప్లిమెంటరీ ఓటర్ల జాబితా(Supplementary Voters List) సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) అధికారులను ఆదేశించింది. గత అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31వరకూ ఉన్న ఓటర్ల జాబితాను అప్డేట్ చేసినట్లు అధికారులు తెలిపారు. దానికి అనుగుణంగా టీ పోల్ సాఫ్ట్ వేర్(TPoll Software) నుంచి ఫిబ్రవరి 3 వరకు సప్లిమెంటరీ ఓటర్ల జాబితా ప్రచురించాలని, అన్ని రాజకీయ పార్టీలతో మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. అలాగే ఫైనల్ సప్లిమెంటరీ జాబితాను ఫిబ్రవరి 6వ తేదీలోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.