గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులు వచ్చేది అప్పుడే!

ManaEnadu:రేషన్ కార్డు (Ration Card).. ఇప్పుడు చాలా వరకు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే ఈ కార్డు తప్పనిసరైంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అర్హులైన కుటుంబాలకు ఈ కార్డు జారీ చేస్తారు. అయితే రాష్ట్రంలో చాలా మంది వివిధ కారణాలతో రేషన్ కార్డు లేక పథకాల (Govt Schemes) లబ్ది పొందలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు.

మంత్రివర్గ ఉపసంఘం భేటీ..
రాష్ట్రంలో దారిద్య్ర రేఖ దిగువన ఉన్న అర్హులైన కుటుంబాలకు నిత్యావసరాల కోసం రేషన్ కార్డు, ఆరోగ్యం కోసం హెల్త్ కార్డులు త్వరలో జారీ చేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో ఇవాళ (సెప్టెంబరు 16వ తేదీ) ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై మంత్రివర్గ ఉపసంఘం 4వ భేటీ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivas), ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ పాల్గొన్నారు.

అక్టోబర్ లో దరఖాస్తులు
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య, కొత్త రేషన్‌ కార్డులు, హెల్త్ కార్డుల (Health Cards) పంపిణీ, ఇతర మార్గదర్శకాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీపై విధి విధానాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, నిబంధనలు, ఏ విధంగా సాఫీగా ముందుకు వెళ్లాలన్న అంశాలపై సమాలోచనలు చేశారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అక్టోబర్ మాసంలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు (Applications) స్వీకరించాలని ఈ భేటీలో నిర్ణయించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించి తుది పక్రియ, ఖరారు ఈ నెలాఖరులో పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉండగా, లబ్ధిదారులు 2 కోట్ల 81 లక్షల 70 వేల మంది ఉన్నారు. ఈ క్రమంలోనే అర్హులైన ప్రతి కుటుంబానికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar) మాట్లాడుతూ.. తెల్ల రేషన్‌ కార్డులకు ఎవరు అర్హులు అనే విషయంలో వచ్చే భేటీలో నిర్ణయిస్తామని తెలిపారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎలా ఉండాలన్న అంశంపై రాజకీయ పార్టీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు రాశామని వెల్లడించారు. ఇప్పటి వరకు 16 మంది ప్రజాప్రనిధులు తమ విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని చెప్పారు. ఆ సూచనలు, సలహాలపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు వివరించారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డు రెండూ కూడా స్మార్ట్ కార్డులు జారీ చేయాలన్నదే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *