ములుగులో BRS గురి పెట్టింది కానీ..సీతక్కను ఓడించేదేలా..?

మన ఈనాడు: Mulugu Seetakka : తెలంగాణలో జరబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ శాయశక్తులను వడ్డుతున్నాయి. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున సీతక్క బరిలో ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజనులు, అడవిబిడ్డలే ఉన్నారు.

గిరిజన వర్గాల్లో సీతక్కకు మంచి గుర్తింపు ఉంది. కరోనా సమయంలో ఆమె మరుమూల గ్రామాలకు వెళ్లి అందరికీ సహాయం చేశారు. అలా ఒక్క ములుగుకే ఆమె పరిమితం కాలేదు. మిగతా గిరిజన ప్రాంతాలకు కూడా వెళ్లేవారు. సీతక్క ములుగులో విజయం సాధిస్తే.. కాంగ్రెస్ తరపున అమె సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో బిఆర్ఎస్ పార్టీ దృష్టంతా ఆమెను ఎలాగైనా ఓడించాలనే ఉంది.

సీతక్కకు పోటీగా మావోయిస్టు నేపథ్యం ఉన్న బడే నాగజ్యోతికి బీఆర్ఎస్ టికెట్ లభించింది. బడే నాగజ్యోతి ములుగు నుంచి పోటీ చేస్తున్నా.. అక్కడ అన్ని వ్యవహారాలు స్వయంగా బీఆర్ఎస్ పెద్దలే చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచే ములుగు నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్కడ మండలాలు, గ్రామాల వారీగా ఇంచార్జుల్ని బీఆర్ఎస్ నియమించింది. వారంతా పార్టీ పెద్దలు ఆదేశాల మేరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ములుగులో ఎక్కువగా గిరిజనులే ఉండడంతో వారిని ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంది. కేసీఆర్‌కు సన్నిహితుడైన పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ములుగు వ్యవహారాల బాధ్యతలు అప్పిగించారు. ఆయన తన అనుచరులతో కలిసి ఓటర్లు ఆకర్షించడానికి రంగంలోకి దిగారు. మరోవైపు సీతక్కలాంటి భారీ ప్రత్యర్థిని కౌంటర్ చేయడానికి.. కాంగ్రెస్ పార్టీ ద్వితీయ నేతలను కూడా బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. వారిని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనుచరులు ప్రలోభాలు చూపించి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారు.

బీఆర్ఎస్ వ్యూహాలన్ని ఇప్పుడు బయటపడడంతో సీతక్క నియోజకవర్గానికే పరిమితమయ్యారు. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచి ఓటర్లను తమవైపు తిప్పుకునే యోచనలో ఉన్నారని సమాచారం. దీంతో సీతక్క ప్రచారంలో ఈ విషయం ప్రస్తావిస్తూ తాను బీఆర్ఎస్‌లా డబ్బులు పంచలేనని.. కానీ ఆ డబ్బులు పంచేవారు తరువాత ములుగు ప్రజలకు అండగా ఉండరని ఓటర్లకు సలహా ఇస్తున్నారు. ప్రజలలో కూడా సీతక్కపై విపరీతమైన అభిమానం కనిపిస్తోంది. డబ్బులలో వారి అభిమానాన్ని కొనలేరని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు

 

Share post:

లేటెస్ట్