Adilabad: కన్నుల పండుగగా గిరిజన వేడుక.. పూజలతో పులకించిన నాగోబా క్షేత్రం

మన ఈనాడు:ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటైన నాగోబా జాతర అంరంగ వైభవంగా మొదలైంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా క్షేత్రంలో గంగా జలాభిషేకంతో జాతరకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 15 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.

ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్‌(Adilabad) జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా క్షేత్రంలో అంరంగ వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. నాగ శేషుడుని పూజించే ఈ నాగోబా జాతర గంగాజలాభిషేకంతో శ్రీకారం చుట్టారు. మేస్రం వంశీయులు ఆలయ గర్బగుడిలో‌ నవధాన్యాలు, పాలు ఉంచి ప్రత్యేక పూజలు చేయగా.. నవదాన్యాలు, పాలకలశం పై కప్పిన తెల్లని వస్త్రం కదలడంతో నాగ శేషుడి ఆశీర్వాదం దొరికిందని ప్రధాన పూజను‌ నాగోబా ఆలయ మేస్రం పూజరులు ఆరంభిస్తారు. రాష్ట్రంలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.

అయితే, జాతర ప్రారంభానికి ఒక రాగి చెంబులో కొన్ని పాలను పోసి.. నవధాన్యాలు, మొలకలు అన్నిటికీ ఒక కొత్త రుమాలును కప్పి గర్బగుడిలోని పుట్టపైన పెడతారు. అయితే, ఆ పుట్టమీద ఉన్న రుమాలు కదిలితేనే.. జాతరకు నాగదేవత అనుమతి ఇచ్చారని అక్కడి వారి నమ్మకం. నాగోబా జాతర ఆదివాసీ సమాజానికి కీలకమైన పండుగ. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఆదివాసీ సమాజాన్ని ఐక్యం చేసే మహా జాతరగా నాగోబాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా ఆ నిమిషాన పురివిప్పి నాట్యం అడుతాడని .. సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో పూజారులకు ఆదిశేషువు కనిపిస్తాడనీ.. వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడనిన మెస్రం వంశీయుల అపార నమ్మకం.

Related Posts

డోంట్ మ్యారీ బీ హ్యాపీ.. చైనా, రష్యాలో ‘పెళ్లిగోల’..

Mana Enadu: ఒక దేశంలోనేమో పెళ్లి జరగదు.. మరో దేశంలోనేమో కడుపు పండదు. పేరుకు ప్రపంచంలో రెండు అతిపెద్ద దేశాలు. కానీ అక్కడి యువత ఆ దేశాధినేతలకు తలనొప్పి తెప్పిస్తున్నారు. పెళ్లి (Marriage)కి నో అంటూ, పిల్లలంటే నోనోనోనో అంటున్నారు. ఫలితంగా…

ISS: స్పేస్ సెంటర్‌ ఇలా ఉంటుందా! అక్కడ వ్యోమగాములు ఏం తింటారో తెలుసా?

ManaEnadu: ఓ వైపు భయం.. మరోవైపు ఏం కాదులే అన్న ధైర్యం. అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు(Astronauts) సునితా విలియమ్స్‌, బుచ్ విల్‌మోర్ గురించి రోజుకో వార్త వింటుంటే భారతీయుల్లోనే కాదు,యావత్ ప్రపంచం కూడా వారి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *