24గంటలు నాడీ పట్టాల్సిందే..మంత్రి పొంగులేటి

మన ఈనాడు: కాంగ్రెస్​ ప్రభుత్వంలో రోగులకు 24గంటల పాటు వైద్యసేవలు అందాల్సిందేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. ప్రజల్లో నమ్మకం పెంచేలా వైద్యసేవలు విస్తరించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్కారు దవాఖాలకు ఆదరణ పెరిగేలా ఉండాలని తెలిపారు.

ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 20 లక్షల వ్యయంతో తీర్థాల గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖాన, రూ. 20 లక్షల నిధులతో ఆరెకోడు తండా గ్రామంలో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనం, రూ. 20 లక్షల వ్యయంతో గుదిమళ్ళ గ్రామ పంచాయతీలో నిర్మించిన పల్లె దవాఖాన నూతన భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేశారు.

వైద్యాధికారులు, సిబ్బంది స్థానికంగా ఉండాలని, కావాల్సిన వసతులు కల్పిస్తామని ఆయన తెలిపారు. ప్రజలను కాపాడుకునే బాధ్యత ఉందని ఆయన అన్నారు. అభయహస్తం కింద 6 గ్యారంటీలు వంద రోజుల్లో ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ క్రింద వైద్య ఖర్చు రూ. 10 లక్షలకు పరిమితి పెంపు అమలు చేశామన్నారు.

Share post:

లేటెస్ట్