బీఆర్​ఎస్ కు​ మరోషాక్..BJP గూటికి మున్సిపల్ ఛైర్మన్​

ManaEnadu: హైదరాబాద్​ నగరంలోనే బీఆర్​ఎస్​ బలంగా ఉందనే భావనలో ఉన్న కేసీఆర్ కు వరుస షాక్​లు తగులుతున్నాయి. మరో మున్సిపల్​ ఛైర్మన్​ ఈటెల రాజేందర్​ సమక్షంలో బీజేపి గూటికి వెళ్లేందుకు సిద్దం అయ్యారు.

తొలి..ఆఖరి ఛైర్మన్​ ఆయనే:
నాగారం పంచాయితీ నుంచి మున్సిపల్​ అప్​గ్రేడ్​ అయిన తర్వాత తొలి మున్సిపల్ ఛైర్మన్​గా కౌకట్ల చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. బీఆర్​ఎస్​ హయంలో మల్లారెడ్డి అనుచరుడిగా ఉంటూనే కేటీఆర్​తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. దీంతో వందల కోట్ట నిధులతో నాగారం ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఈక్రమంలోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి.

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మున్సిపల్​ ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మాణాలు ప్రారంభం అయ్యాయి. నాగారం(Nagaram) ఛైర్మన్​ చంద్రారెడ్డిపై కూడా అవిశ్వాసం పెట్టారు. కానీ చివరకు నెగ్గకుండా రాజకీయం చేసి మళ్లీ ఛైర్మన్​గానే కొనసాగుతున్నారు.

మల్కాజిగిరి(Malkajgiri)పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ నుంచి ఈటెల రాజేందర్(Etela Rajender) పోటీ చేయబోతున్నారు. ఆయనతో సన్నిహిత సంబంధాలు నాగారం మున్సిపల్​ ఛైర్మన్​ కౌకట్ల చంద్రారెడ్డికి ఉన్నాయి. ఈక్రమంలో వారం రోజుల్లోపే ఈటెల సమక్షంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారానికి బలంగా శనివారం ఛైర్మన్​ మొబైల్​ స్టేటస్​గా ఈటెల సందేశాన్ని పెట్టుకోవడంతో మరింత బలం చేకూరింది.

సీఎం రేవంత్​రెడ్డి సర్కారు ఓఆర్​ఆర్​(ORR)లోపల ఉన్న మున్సిపాలటీలు, కార్పొరేషన్లను జీహెచ్​ఎంసీ(GHMC) కలుపుతూ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఆతర్వాత ఎన్నికలే జరిగా అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా జరిగితే నాగారం మున్సిపాలిటీ తొలి ఛైర్మన్​..ఆఖరి ఛైర్మన్​గా కౌకట్ల చంద్రారెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఆతర్వాత జరిగే ఎన్నికల్లో నాగారం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది.

Share post:

లేటెస్ట్